లండన్, మే 22: అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ కోసం ఈ ఏడాది తుది బరిలో నిలిచిన ఏకైక భారతీయుడు, ప్రఖ్యాత కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తికి చివరికి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం అమెరికా రచయిత లిడియా డేవిస్‌ను వరించింది.
అంతర్జాతీయం
లండన్, మే 22: అంతర్జాతీయ మ్యాన్ బుకర్ ప్రైజ్ కోసం ఈ ఏడాది తుది బరిలో నిలిచిన ఏకైక భారతీయుడు, ప్రఖ్యాత కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తికి చివరికి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం అమెరికా రచయిత లిడియా డేవిస్‌ను వరించింది.
వాషింగ్టన్, మే 22: ముంబయి తీవ్రవాద దాడుల కేసులో నిందితుడుగా ఉన్న డేవిడ్ హెడ్లీని, అతని సహచరుడు తహవుర్ రాణాను తమ విచారణకు అప్పగించాలని అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై ఉభయ పక్షాల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.
ఇస్లామాబాద్, మే 22: ఎల్లవేళలా తమకు వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్‌తో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి హామీ ఇచ్చారు. భారత పర్యటనను ముగించుకొని మంగళవారం ఇక్కడికి వచ్చిన చైనా ప్రధానికి ఘనస్వాగతం లభించింది.
వాషింగ్టన్, మే 22: అమెరికాలోని లక్షలాది మంది అక్రమమ వలసదారులకు ఆశాకిరణమైన కీలకమైన ఇమిగ్రేషన్ బిల్లుకు సెనేట్‌కు చెందిన జ్యుడీషియరీ కమిటీ మంగళవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు వాస్తవరూపం దాల్చే దిశగా మరో అడుగు ముందుకేసింది.
లండన్, మే 21: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న భారతీయ సైకత (ఇసుక) శిల్పి సుదర్శన్ పట్నాయక్ డెన్మార్క్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన కోపెన్‌హెగెన్ అంతర్జాతీయ సైకత శిల్పాల ఉత్సవంలో మరోసారి సత్తా చాటుకున్నాడు. పర్యావరణంపై వేసిన ఆయన సైకత శిల్పం గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకుంది.
ఖాట్మండు, మే 21: ఒక కాలు లేకపోయినా ఆమె కుంగిపోలేదు... ఆత్మవిశ్వాసం వీడలేదు. అందరూ తనపై చూపిస్తున్న సానుభూతికి బదులు ఔరా అనుకునేలా చేయాలని దృఢమైన నిర్ణయానికొచ్చింది. ఆ మనోధైర్యమే ఆమెను ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేలా చేసింది.
హోస్టన్/ వాషింగ్టన్, మే 21: అమెరికాలో టోర్నడో పెనుతుపాను ఓక్లహామా నగరాన్ని అతలాకుతలం చేసింది. వందలాది నివాస గృహాలను నేలమట్టం చేసింది. రెండు ప్రాథమిక పాఠశాలలు సైతం కుప్పకూలడంతో 20మంది చిన్నారులు సహా 90మందికి పైగా మృత్యువాతపడ్డారు.
రమడి (ఇరాక్), మే 20: ఇరాక్‌లోని అన్‌బర్ ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి సంభవించిన వివిధ హింసాత్మక సంఘటనల్లో 24 మంది పోలీసులు మృతి చెందారని పోలీసులు, వైద్యులు సోమవారం ఇక్కడ చెప్పారు.
బీజింగ్, మే 20: భారత జాతి ఆత్మగౌరవాన్ని, జాతీయతను గౌరవించి మనగలగాల్సి అవసరం ఉందని చైనా మీడియా పిలుపునిచ్చింది. జపాన్ లేదా ఫిలిప్పీన్స్ తరహాలో భారత్‌తో కూడా సంబంధాలు క్షీణిస్తే సరిహద్దులో ఇక సెగలేనని వెల్లడించింది.
ఇస్లామాబాద్, మే 19: భారత్‌తో సంబంధాల విషయంలో కాబోయే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సానుకూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఆచితూచి చర్యలు తీసుకోవాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ సూచించినట్లు మీడియా వార్తలు ఆదివారం పేర్కొన్నాయి.