మూడవసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన
సందర్భంగా శనివారం గౌహతిలో పాఠశాల విద్యార్థినులతో కలిసి కేక్‌ను కట్ చేస్తున్న తరుణ్ గొగోయ్
జాతీయ వార్తలు
మూడవసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన
సందర్భంగా శనివారం గౌహతిలో పాఠశాల విద్యార్థినులతో కలిసి కేక్‌ను కట్ చేస్తున్న తరుణ్ గొగోయ్
సియోల్, మే 18: తక్కువ దూరం ప్రయాణించే మూడు గైడెడ్ క్షిపణులను ఉత్తర కొరియా తమ తూర్పు ప్రాంత సముద్ర జలాల్లోకి ప్రయోగించిందని, ప్యాంగ్యాంగ్ తరచుగా ఇటువంటి క్షిపణి ప్రయోగాలు జరుపుతోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది.
న్యూఢిల్లీ, మే 18: అమ్మాయిల వేధింపు సంఘటనలు పదే పదే జరుగుతూ ఉన్న కారణంగా తమ టీనేజ్ బాలికలను పాఠశాలలకు పంకూడదని మహేంద్రగఢ్ జిల్లాలోని ఆరు గ్రామ పంచాయతీలు నిర్ణయించినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
జాల్నా, మే 18: మహారాష్టల్రోని జాల్నా జిల్లా జిల్లా సత్త్ఫాల్ గ్రామంలో 32 ఏళ్ల మహిళను గత కొన్ని నెలలుగా బెదిరించి లొంగదీసుకుని అనుభవిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఇద్దరిని అరెస్టు చేగా, గ్రామ సర్పంచ్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
కోల్‌కతా, మే 18: పశ్చిమ బెంగాల్‌లో వేలాది మంది చిన్న మదుపరులను నిలువునా ముంచిన శారదా గ్రూపు చైర్మన్ సుదీప్త సేన్‌ను ఇక్కడి బిధానగర్ కోర్టు శనివారం జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
చెన్నై, మే 18: జాతీయ మైనారిటీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిఎఫ్‌సి)ని పునర్‌వ్యవస్థీకరించే యోచన ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి కె రెహ్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. సంస్థల నుంచి డిపాజిట్టు సేకరించే యోచన ఉందని శనివారం ఇక్కడ చెప్పారు.
న్యూఢిల్లీ, మే 18: భూవివాదం కేసులో ఒక వ్యాపారి నుంచి 7 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న సిబిఐ ఉన్నతాధికారి వివేక్‌దత్, మరో ముగ్గురిని శనివారం స్థానిక కోర్టు మూడు రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది.
న్యూఢిల్లీ, మే 18: అఫ్గానిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలని ఆ దేశం చేసిన విజ్ఞప్తిని పరిశీలించేందుకు, ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు దానిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 18: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) రూపొందించిన ముసాయిదా నివేదికపై కమిటీ సభ్యుల్లో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో జెపిసి వచ్చే నెల సమావేశం కానుంది.
భరూచ్ (గుజరాత్), మే 18: వ్యవసాయ రంగంలో భారత్ తన ప్రాభవాన్ని చాలా వేగంగా కోల్పోతోందని, జాతీయ వ్యవసాయాభివృద్ధి రేటు ఎంతో ‘పేలవం’గా ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.