క్రీడాభూమి

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: స్పాట్ ఫిక్సింగ్ కేసు రానురాను విస్తృతమవుతున్నది. తవ్వినకొద్దీ నిందితుల జాబితా పెరుగుతోంది. తాజాగా మరో ఐపిఎల్ జట్టుతోపాటు, ముగ్గురు క్రికెటర్ల పాత్రపై ఆరా తీస్తున్నట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించాడు.

24/05/2013

చెన్నై, మే 23: స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారణకు శుక్రవారం తమ ముందు హాజరుకావాలని చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గురునాథ్ మెయ్యప్పన్‌ను ముంబయి పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే బోట్ క్లబ్‌లోని గురునాథ్ ఇంటికి సమన్లు పంపారని ఇక్కడికి వచ్చిన ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లతోపాటు అరెస్టయిన అజిత్ చండీలా చుట్టూ కేసు మరింత బలంగా బిగుసుకుంటున్నది.

24/05/2013

న్యూఢిల్లీ, మే 23: రోజుకో మలుపు తిరుగుతున్న స్పాట్ ఫిక్సింగ్ సంఘటన కారణంగా సిగ్గుతో తలదించుకుంటున్నానని కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ వాపోయారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ క్రీడాభిమానిగా, క్రీడా శాఖ మంత్రిగా తాను ఈ సంఘటనను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని అన్నారు.

24/05/2013

కోల్‌కతా, మే 23: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ చివరి అంకం ఆరంభమైంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలు సంపాదించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మొదటి క్వాలిఫయర్‌లో తలపడ్డాయి.

23/05/2013

టోక్యో, మే 22: లండన్ ఒలింపిక్స్ పురుషుల హ్యామర్ త్రోలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న జపాన్ అథ్లెట్ కొజి మరొఫుషికి కోర్టులో చుక్కెదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) సభ్యుడిగా పోటీపడి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అతను కోర్టును ఆశ్రయించాడు.

23/05/2013

లండన్, మే 22: బ్రిటన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి గాయం కారణం వైదొలిగాడు. గత వారం రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో మార్సెల్ గ్రానొలియర్స్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ముర్రే వీపు నొప్పితో బాధపడ్డాడు.

23/05/2013

మెల్బోర్న్, మే 22: ట్విటర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) 5,750 డాలర్ల జరిమానా విధించింది. నిబంధనావళిని అతిక్రమించి వార్నర్ ప్రవర్తించాడని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సిఎ వ్యాఖ్యానించింది.

23/05/2013

ముంబయి, మే 22: స్పాట్ ఫిక్సింగ్ కేసులో బాలీవుడ్ నటుల ప్రమేయంపై ముంబయి పోలీసులు దృష్టి సారించారు. ప్రముఖ నటుడు, దివంగత రెజ్లర్ దారా సింగ్ కుమారుడు విందూ రణ్‌దావాను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

23/05/2013

న్యూఢిల్లీ, మే 22: ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకపోయినా, చివరి వరకూ పోరాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ దశలో నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 4 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading