రాష్ట్ర వార్తలు

20/06/2013
హైదరాబాద్, జూన్ 19 : భూమాతను రక్షించుకునేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని భగవాన్ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ పిలుపు ఇచ్చారు. బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో తాజాగా వచ్చిన భారీ వర్షాలు, వరదలు మానవాళికి ఒక హెచ్చరికలాంటివన్నారు.
20/06/2013
ఖమ్మం, జూన్ 19: గోవుల తరలింపు ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతంలో కూడా గోవులను తరలిస్తుండగా విహెచ్‌పి కార్యకర్తలు అడ్డుకున్న విషయంలో తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. పోలీసులను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
20/06/2013
రాజమండ్రి, జూన్ 19: పోలవరం హెడ్‌వర్క్స్ నిర్మాణ ప్రాంతాన్ని కేంద్రప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బుధవారం పరిశీలించింది.
20/06/2013
కడప, జూన్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను వచ్చే నెల 8న కడప వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన అగ్రనేతలందరినీ రప్పించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నారు.
20/06/2013
ఎ కొండూరు, జూన్ 19: కృష్ణా జిల్లా ఎ కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన వౌనిక (18) అనే విద్యార్థిని తను చదివే కళాశాల అధ్యాపకుని లైంగిక వేధింపులు భరించలేక తీవ్ర మనస్థాపంతో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం...
20/06/2013
గుంతకల్లు/ఉరవకొండ, జూన్ 19: ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకుని అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం, చిన్న హోతూరు గ్రామానికి చెందిన వీరభద్రప్ప(19) మృతి చెందాడు. బుధవారం ఈ సమచారం అందుకున్న బంధువులు హతాశులయ్యారు.
20/06/2013
తిరుపతి, జూన్ 19: ప్రతిఏడాది జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే జ్యేష్ట్భాషేకం ఈనెల 20 నుండి నిర్వహించనున్నట్లు టిటిడి పౌర సంబంధాల అధికారి టి రవి తెలిపారు. దీన్ని అభిధ్యేయక అభిషేకం అని కూడా అంటారు.
20/06/2013
కర్నూలు, జూన్ 19: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా ఉత్తరకాశీలో ఇబ్బందులు పడుతున్న యాత్రికులను రాష్ట్రానికి రప్పించడానికి అవసరమైన రైళ్లను ప్రత్యేకంగా నడుపుతామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు.
20/06/2013
మార్కాపురం, జూన్ 19: చెల్లించిన దానికంటే ఐదురెట్లు అధికంగా ఇస్తామంటూ ప్రజలను నమ్మించి సుమారు కోటి 20లక్షల రూపాయలు వసూలు చేసిన మార్తాన్ సంస్థ నిర్వాహకుడు జగతప్ మహేష్‌కుమార్ అలియాస్ నానిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు.
20/06/2013
విజయవాడ /నందవరం, జూన్ 19: అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇద్దరు రెవిన్యూ అధికారులు దొరికిపోయారు. కృష్ణా జిల్లాలో ట్రెజరీ అధికారి, కర్నూలు జిల్లాలో డిప్యూటీ తహసిల్‌దార్ పట్టుబడ్డారు. కృష్ణాజిల్లా ట్రెజరీ కార్యాలయంలో పని చేస్తున్న సబ్ ట్రెజరీ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading