వీక్ పాయింట్

18/05/2013

క్రికెట్ అనేది బాలూ, బ్యాటుతో ఆడే ఆట అని ఇప్పటిదాకా అనుకుంటున్నాం.
కాదు. అది బాలూ, బెట్టు కలిపి ఆడే ఆట అని ఇప్పుడు అర్థమైంది.

11/05/2013

మన రక్షణమంత్రి ఎవరు?
భగవంతుడు.
దయతలిచి ఆయన ఓ కంట కనిపెడుతున్నాడు కాబట్టే ఈ మాత్రమైనా ఉన్నాం. ఎలాగూ దేవుడు చూసుకుంటాడు కాబట్టి మనలనేలే వారు కూడా సరిహద్దుల రక్షణ భారాన్ని ఆయన మీదే వదిలేశారు.

04/05/2013

ఈ దశాబ్దపు మొద్దబ్బాయి!
ఈ పేరిట కొత్త అవార్డొకదాన్ని ఇవ్వదలిస్తే ఎవరికివ్వాలా అని వెదుకులాడాల్సిన పని లేదు. అన్ని విధాల దానికి యోగ్యుడైనవాడు మన మధ్యే ఉన్నాడు:
సిబిఐ పెద్దాయన రంజిత్ సిన్హా.

27/04/2013

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిచుట్టూ తిరుగుతుంది.
అలాగే- తెలుగుభాష ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సాంస్కృతిక శాఖ చుట్టూ తిరుగుతోంది.
తనచుట్టూ తాను ఎందుకు తిరుగుతోందంటే ప్రజలచుట్టూ తిరిగేందుకు, జనంలోకి చొచ్చుకు వెళ్లేందుకు సర్కారువారు వీలు కలిపించలేదు కనుక.

13/04/2013

మిగతా సంగతులు తరువాత. మన పాలక మారాజులు అర్జంటుగా దృష్టి పెట్టాల్సింది జైళ్ల సంస్కరణ మరియు ఆధునీకరణల మీద.

06/04/2013

పూర్వం స్వయంవరం ప్రకటించాకే ఎక్కడెక్కడి రాజకుమారులూ పోటీకి వచ్చేవారు. మన మారాజులు ఇంకా ఫాస్టు. స్వయంవరం ప్రకటించకుండానే, సాధారణ ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉండగానే ప్రధాని వరమాల వేయించుకోగోరే వారు తలా ఒక రకంగా మెడలు ముందుకు వంచుతున్నారు.

30/03/2013

సంజయ్ మంచి బాలుడు.
ఎందుకంటే చెడ్డ పనులు బాగా చేస్తాడు.
ఫస్ట్‌క్లాస్ దేశద్రోహులతో ఎక్స్‌లెంట్ సంబంధాలు పెట్టుకుంటాడు.

23/03/2013

ఇది ఇండియా మార్కు న్యాయం!
ముంబయి మహానగరంలో పట్టపగలు ఒకే రోజు పదమూడుచోట్ల ఆర్డీఎక్స్ బాంబులు పేల్చి 257 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టు ఘాతుకం కేసులో తుది తీర్పుకు ఇరవై ఏళ్లు (మాత్రమే) పట్టింది!

09/03/2013

భీష్ముడా, పక్కకు జరుగు. నిన్ను మించినవాడు వచ్చాడు.

02/03/2013

వెంకన్నబాబు వట్టి అమాయకుడు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయి ఉండీ తన పెళ్లి ఖర్చులకోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. తీసుకున్న నేరానికి ఇన్ని వేల సంవత్సరాల తరవాత కూడా, ఏటా ఎన్నివేల కోట్లు వచ్చినా బాకీ తీర్చలేక పాపం ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading