జాతీయ వార్తలు

ప్లాంటున్న రాష్ట్రాలకు 12 శాతం ఉచిత విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పినా ఆ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో గరిష్ఠంగా 12 శాతం విద్యుత్‌ను ఆ రాష్ట్రానికి ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోందని పేర్కొంటూ, ఈ నిబంధనను మార్చాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ విషయం వెల్లడించారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పినప్పుడు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు విజయవంతం కావడానికి భూమి మొదలగు వాటిని సమకూరుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అందువల్ల సదరు రాష్ట్రం ఆ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో గరిష్ఠంగా 12 శాతాన్ని ఉచితంగా పొందే సౌకర్యం కొనసాగుతుందని మంత్రి వివరించారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దేశీయ బొగ్గు వినియోగానికి సంబంధించిన నిబంధనలను సరళతరం చేసే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని మంత్రి గోయల్ వెల్లడించారు.
ఈ విధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బొగ్గును ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ (ఐపిపి) ఉత్పత్తి కేంద్రాలకు ఇచ్చి, అందుకు సమానమైన విద్యుత్‌ను వాటినుంచి తీసుకోవచ్చని ఆయన వివరించారు.