జాతీయ వార్తలు

జకీర్ నాయక్ అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు వ్యతిరేకంగా ఇక్కడి ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఉగ్రవాద కేసులో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద జకీర్ నాయక్, మరికొందరిపై నిరుడు కేసు నమోదు చేసింది. ఈ కేసులో మూడుసార్లు సమన్లు పంపించినప్పటికీ జకీర్ నాయక్ విచారణకోసం తన ముందు హాజరు కాలేదని, అందువల్ల అతడిని తీసుకొచ్చి విచారించడానికి ఇంటర్ పోల్ సహాయం అవసరమని ఎన్‌ఐఎ ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు తెలిపింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక రెస్టారెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగిన అనంతరం ఎన్‌ఐఎ జకీర్ నాయక్, అతను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న కొంతమందిపై ఐపిసిలోని సెక్షన్ 153ఎ, యుఎపిఎ కింద కేసు నమోదు చేసింది.