జాతీయ వార్తలు

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని సాగుభూముల్ని పంటల విభాగాలుగా చేయాలి
పరిశోధనలకు ఊతం అనుబంధ పరిశ్రమలకు మద్దతు
మన్రేగాలో మార్పులు అవసరం
8 ప్రతిపాదనలతో నీతిఆయోగ్‌కు కెసిఆర్ నివేదిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23:రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెండింతలు చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనిమిది అంశాలతో కూడిన ప్రతిపాదనను నీతి ఆయోగ్ పాలక మండలికి అందించారు. తెలంగాణలో 17వేల కోట్ల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయటం ద్వారా 35 లక్షల మంది రైతులకు మేలు చేశామన్నారు. ఎకరానికి నాలుగు వేల రూపాయల పెట్టుబడి అందించే పథకాన్ని ఇటీవలే ప్రకటించామన్నారు. ఈ నిర్ణయం వలన ఒకటిన్నర కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్న 55 లక్షల మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు అందజేయాలని ప్రతిపాదించారు.
కెసిఆర్ ప్రతిపాదనలు ఇవే
దేశంలోని మొత్తం వ్యవసాయ భూములను వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంటల విభాగాలుగా విభజించాలి. తద్వారా అవసరానికి మించి పంటలు పండకుండా చర్యలు తీసుకోవటంతోపాటు రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు వీలు కలుగుతుంది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినా పంటల దిగుబడి మాత్రం పెరగలేదు. దిగుబడి పెంచేందుకు పరిశోధన పెంచాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం పరిశోధనకు ఆర్థిక మద్దతు ఇవ్వాలి.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్ర సహాయంతో వీలున్నంత త్వరగా పూర్తి చేయాలి. వ్యవసాయ రంగానికి తక్కువ ధరకు విద్యుత్తును సరఫరా చేయాలి. పంటల బీమా పథకంలోని లోపాలను తొలగించి సంస్కరించాలి.
ఆహార ధాన్యాలు, నూనె గింజలు, నూనె వస్తువులు, దుస్తుల దిగుమతుల విధానాన్ని పునస్సమీక్షించుకోవటం ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు విదేశీ ఉత్పత్తుల అనవసరపు పోటీ లేకుండా చేయాలి.
రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి.
డెయిరీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమ, అటవీ తదితర వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలి. వీటిని ఆదాయం పన్ను నుండి మినహాయించాలి.
తప్పనిసరి చెట్ల పెంపకం నిధి- 2016 చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలి.
మన్రేగా పథకం వ్యవసాయ రంగానికి తోడ్పడే విధంగా ఉండేందుకు దీనిని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయాలి. 50 శాతం మన్రేగా నిధులను నైపుణ్యం లేని వారికి చెల్లించి, యాభై శాతం రైతుల ద్వారా చెల్లించేలా మార్పులు చేయాలి. దీనివలన రైతులు వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు వీలు కలగటంతోపాటు సమాజంలోని బలహీనవర్గాలకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలనుకునే రాష్ట్రాలకు దీనిని పొడిగించాలి.