క్రీడాభూమి

ఇలాంటి మ్యాచ్ తర్వాత ఏం మాట్లాడతా: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 29: ఇంత దారుణంగా ఓడిన తర్వాత ఒక కెప్టెన్‌కు మాట్లాడేందుకు ఏముంటుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ వాపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నామని అన్నాడు. బ్యాటింగ్‌లో రాణించలేక విఫలమై, చేతులారా ఓటమిని కొనితెచ్చుకున్నామని వ్యాఖ్యానించాడు. ప్లే ఆఫ్ దశకు చేరుకునే ఆశలు ఇక లేవని అన్నాడు. మిగతా నాలుగు మ్యాచ్‌లను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడం మినహా చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు. ఒకవేళ మిగతా నాలుగు మ్యాచ్‌లను గెల్చుకున్నా, ప్లే ఆఫ్‌లో చోటు సంపాదించడం అసంభవమని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ గెలిచిందని అనేకంటే, బెంగళూరు ఓడిందని అనడమే న్యాయమని అన్నాడు. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నప్పటికీ, పరుగుల వేటలో తడబడడం కారణంగానే వికెట్లు పారేసుకున్నామని చెప్పాడు.
పుణే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మాట్లాడుతూ, జట్టు మొత్తం ఒకటిగా నిలవడం వల్లే బెంగళూరును ఓడించగలిగామని అన్నాడు. ఈ విజయం ప్రతి ఒక్కరికీ చెందుతుందని చెప్పాడు. నాలుగు ఓవర్లు బౌల్ చేసి, కేవలం ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన లాకీ ఫెర్గూసన్‌ను అతను ప్రత్యేకంగా అభినందించాడు. అతని కారణంగా బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ను కట్టడి చేయగలిగామన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే పోరాటాన్ని కొనసాగించి, విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.