జాతీయ వార్తలు

మధ్యవర్తిత్వం నెరపబోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ వివాదంపై చైనా స్పష్టీకరణ
అది భారత్, పాక్‌ల ద్వైపాక్షిక అంశమని వ్యాఖ్య

బీజింగ్, మే 4: కాశ్మీర్ వివాదం భారత్, పాకిస్తాన్‌ల ద్వైపాక్షిక అంశమని, అందువల్ల ఆ వివాదం పరిష్కారం కోసం ఆ రెండు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం నెరపబోనని చైనా గురువారం స్పష్టం చేసింది. చైనా తన ప్రయోజనాల కోసం కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం సంచికలో ఒక వ్యాఖ్యానం ప్రచురితమయిన నేపథ్యంలో చైనా ఈ వివరణ ఇచ్చింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సిపిఇసి) కోసం చైనా జమ్మూకాశ్మీర్ విషయంలో తన వైఖరిని మార్చుకోదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక వార్తాసంస్థకు తెలిపింది. ‘కాశ్మీర్ అశంపై చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. ఇది భారత్, పాకిస్తాన్‌లకు చారిత్రకంగా సంక్రమించిన వివాదం. భారత్, పాకిస్తాన్‌లు సంప్రదింపులు, చర్చల ద్వారా ఈ వివాదాన్ని తగినవిధంగా పరిష్కరించుకుంటా యి’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఇమెయిల్ ప్రకటనలో పేర్కొంది. జమ్మూకాశ్మీర్‌లో మూడింట రెండు వంతుల భూభాగం భారత్‌లో అంతర్భాగంగా ఉండగా, మిగతా ఒక భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. ఈ వివాదం పరిష్కారంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘సిపిఇసి నిర్మాణం కాశ్మీర్‌కు సంబంధించి చైనా వైఖరిని ప్రభావితం చేయదు. భారత్, పాకిస్తాన్‌లు సంప్రదింపులను, చర్చలను పెంచుకోవడం ద్వారా విభేదాలను సజావుగా పరిష్కరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను కాపాడుతాయని మేము విశ్వసిస్తున్నాం’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. రత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు నిర్మాణాత్మక కృషి జరపాలని చైనా కోరుకుంటోంది’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.