Others

రి‘టైర్’మెంట్ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరిగిపోయిన టైర్లని పారేసే కాలానికి కాలం చెల్లింది. ఇప్పుడు వాటికి సరికొత్త అందాలను సంతరించుకునేలా చేసే సృజన కొంతమంది చేజిక్కించుకున్నారు. దాంతో టైర్లకు రిటైర్మెంటు లేదని చెప్పొచ్చు. చాలాకాలం వాహనాల బరువు మోసి రోడ్లపై తిరుగాడిన టైర్లు ఇప్పుడు వివిధాకృతులతో ఏసీ రూముల్లో ఠీవిగా బైఠాయిస్తున్నాయి. ఆరుబయట తోటల్లో, పార్కుల్లో, డ్రాయింగ్ రూముల్లో తమదైన సరికొత్త ఆకారాన్ని సంతరించుకుని ఔరా అని అనిపించుకుంటున్నాయి. పూర్తి టైర్లు, సగం సగం టైర్లు, టైరు ముక్కలతో ఎన్నో కళాకృతులు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటూ ఇంటీరియర్ డెకరేషన్‌లో భాగమవుతున్నాయి. కుర్చీలు, బెంచీలు, డైనింగ్ టేబుళ్లు, టీపాయ్‌లుగా, సీల్, మొసలి, హంస, తేలు, చేప తదితర జీవాకృతులుగా, లౌడ్‌స్పీకర్లు, సీలింగ్ లైట్లు, వాష్ బేసిన్లుగా అలంకరణకి ఆలంబనగా నిలుస్తున్నాయి. మొక్కల పెంపకానికి అనువుగా కుండీల మాదిరిగా గోడలపై కూర్చుంటున్నాయి. కళాతృష్ణ ఉండాలే కానీ, కాదేదీ కళ కనర్హం అన్నట్లు టైర్ల కళాకృతులు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి