Others

నాకు నచ్చిన చిత్రం-- ఈనాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనాలకు మారుపేరైన హీరో కృష్ణ పద్మాలయ మూవీస్ పతాకంపై సమర్పించి నటించిన ‘ఈనాడు’ చిత్రం అంటే నాకెంతో ఇష్టం. పి.సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోకు హీరోయిన్ ఉండదు. ఫక్తు రాజకీయ చిత్రం. పరచూరి బ్రదర్స్ మాటలు, పుష్పాల గోపీకృష్ణ కెమెరా, జె.వి.రాఘవులు సంగీతం, నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది.
జమున, జగ్గయ్య, రావుగోపాలరావు, సత్యనారాయణ, గుమ్మడి, చంద్రమోహన్, రాధిక, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, సుధాకర్, రాజా, శ్యామల గౌరీ, ఝాన్సీ తదితరులు నటించారు. రావుగోపాలరావు విలన్ వైవిధ్యంగా ఉంటుంది. పుల్లారావుగా జగ్గయ్య నటన సినిమాకు హైలెట్. రాజకీయ నాయకులు పార్టీలు మారడం, చంద్రమోహన్ రాధికల పెళ్లిలో కల్తీసారా తాగి జనాలు చనిపోవడం, కాలేజీ ర్యాగింగ్‌లో శ్యామలగౌరీ ఆత్మహత్య చేసుకోవడం, బుర్ర కథ సన్నివేశాలు చిత్రంలో దర్శకుడు బాగా తీసారు. పతాక సన్నివేశాలు విజయవాడ నగర వీధుల్లో చిత్రీకరించారు. కృష్ణ నటన మొదటినుండి చివరి వరకు ఒకే రకం వస్త్ర ధారణ, తెల్లటి డ్రెస్‌లో ఎక్కువ మేకప్ లేకుండా సహజంగా నటించి మెప్పించారు. కృష్ణ 200 చిత్రంగా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొంది ఘన విజయం సాధించింది.

-జి. గౌరీగాయత్రి, ఉప్పల్