ఆంధ్రప్రదేశ్‌

సీమ కరవు పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 16: రాయలసీమలో నెలకొన్న కరవు నివారణపై రాష్ట్ర ప్రభుత్వం బూటకపు మాటలతో ప్రజలను మభ్య పెడుతోందని, తక్షణం సీమ కరవుపై దొగొచ్చి బుధవారం సాయంత్రంలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అల్టిమేటమ్ ఇచ్చారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ కరవు పరిస్థితులపై రెండు రోజుల ‘సీమ బైఠాయింపు’ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కేంద్ర కమిటీసభ్యుడు ఎంఎ గఫూర్ తదితరులు ప్రసంగించారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని, గాలేరు-నగరి ద్వారా సీమకు సాగునీరందించాలని, అనంత జిల్లా కరవు నివారణకు హంద్రీ నీవా పథకం రెండోదశ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సీమ బంద్ పాటిస్తామని హెచ్చరించారు. సీమలో 1600 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విలయతాండవం చేస్తోందని, చాలా గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారని కె.రామకృష్ణ అన్నారు. రైతులకు గత ఏడాది చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.4,523 కోట్లు, ఉపాధి కూలీలకు రూ.300 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సిపిఎం నేత మధు మాట్లాడుతూ ఫసల్ బీమా పేరుతో బజాజ్, రిలయన్స్‌కు లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది రైతులు రూ.21,500 ప్రీమియం చెల్లించారని, రూ.714 కోట్లు బీమా చెల్లిస్తామని చెప్పినా, రాష్ట్ర వాటా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. హంద్రీనీవా రెండోదశ పూర్తి చేయాలని, కడప స్టీల్ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం.. సీమ బైఠాయింపులో సంఘీభావం తెలుపుతున్న వామపక్షాల నాయకులు