క్రీడాభూమి

నంబెర్గ్‌లో సానియా జోడీకి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబెర్గ్, మే 23: నంబర్గ్‌లో జరుగుతున్న డబ్ల్యుటిఎ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి యారోస్లావా స్వెదోవాకు ఆదిలోనే చుక్కెదురైంది. మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న సానియా మీర్జా, స్వెదోవా మంగళవారం ఇక్కడ చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ), మిసాకీ దోయ్ (జపాన్) జోడీతో జరిగిన తొలి రౌండ్ పోరులో పేలవమైన ప్రదర్శనతో విఫలమై 5-7, 2-6 సెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీకి ముందు సానియా జోడీకి ఇదే చివరి ఈవెంట్.