బిజినెస్

అగర్‌బత్తీలపై పన్ను తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 23: కొత్తగా ప్రవేశపెడుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లో అగరుబత్తీలపై విధించిన పన్నును 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని దేశంలోని వివిధ అగర్‌బత్తీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కోరారు. 12 శాతం పన్ను విధింపు వలన అగరుబత్తీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు జిఎస్‌టి కౌన్సిల్ కార్యదర్శి హస్ముఖ్ అధియాను న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మంగళవారం కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అంబికా దర్బార్ ఉత్పత్తిదారులు, అంబికా గ్రూప్ చైర్మన్ అంబికా కృష్ణ, సైకిల్ బ్రాండ్ అగరుబత్తీ ఉత్పత్తిదారులు (మైసూర్), జడ్‌బ్లాక్ అగరుబత్తీ ఉత్పత్తిదారులు (గుజరాత్), హరిదర్శన్ అగరుబత్తీ ఉత్పత్తిదారులు (్ఢల్లీ)సహా దేశంలోని పలు అగరుబత్తీల ఉత్పత్తిదారులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. అగరుబత్తీలపై జిఎస్‌టిలో 12 శాతం పన్ను విధింపు వల్ల అగరుబత్తీ పరిశ్రమకు జరిగే నష్టాన్ని వారు ఆయనకు వివరించారు. దీనిపై జిఎస్‌టి కౌన్సిల్‌లో చర్చించి, ఒక నిర్ణయం తీసుకుంటామని హస్ముఖ్ అధియా హామీ ఇచ్చారని వారు తెలిపారు.