బిజినెస్

ఖాదీ బోర్డు చైర్మన్ యూసుఫ్పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ‘మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి..’ అని తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనువైన రాష్ట్రం అని ఆయన వారికి తెలిపారు. శనివారం అమెరికాలోని శాంటాక్లారాలో ఐటి, డాటా, గేమింగ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణ ఐటి, పారిశ్రామిక విధానాలను వారికి కెటిఆర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు తమ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఐటీ సర్వ్ ప్రతినిధులతో సమావేశమైనప్పుడు కూడా ఆయన ఐటి పరిశ్రమల కోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీల గురించి చెప్పారు. దీంతో ఐటీ సర్వ్ ప్రతినిధులు స్పందిస్తూ హైదరాబాద్‌లో సిగ్నేచర్ టవర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా, మంత్రి కెటిఆర్ అందుకు సానుకూలంగా స్పందించారు. డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన డాటా అనలిటిక్స్‌లో ప్రముఖ కంపెనీ అయిన విఎంవేర్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమై చర్చించారు. హైదరాబాద్‌లో పెట్టబోయే డాటా అనలిటిక్స్ పార్క్‌లో ప్రధాన పెట్టుబడిదారులుగా ఉండాలని విఎంవేర్ ప్రతినిధులను మంత్రి కెటిఆర్ కోరారు. ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ రంగాలకు హైదరాబాద్‌లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వారికి వివరించారు. మరోవైపు సౌదీ అరేబియాలో అక్రమ కేసులో ఇరుక్కున తనను తెలంగాణకు రప్పించేందుకు సహాయం చేయాల్సిందిగా కరీంనగర్‌కు చెందిన అనిల్ కుమార్ చేసిన వినతికి మంత్రి కెటిఆర్ స్పందిస్తూ తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం... అమెరికా పర్యటనలో అక్కడి ఓ సంస్థ ప్రతినిధితో చర్చలు జరుపుతున్న తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్