జాతీయ వార్తలు

లక్ష దాటిన తలసరి ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: భారతీయుల తలసరి ఆదాయం 2016-17లో 9.7 శాతం పెరిగి 1,03,219 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు నమోదైన తలసరి ఆదాయం 94,130 రూపాయలు. 2015-16లో తలసరి ఆదాయం పెరుగుదల 7.4 శాతంగా నమోదైందని ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ధరల ప్రకారం లెక్కగడితే తలసరి ఆదాయం లక్ష దాటిందని వివరించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రెండేళ్ల ధరలు, ఆదాయ వృద్ధిని లెక్కగట్టి తాజా వివరాలను వెల్లడించింది. ప్రజల తలసరి ఆదాయం ఎంతగా పెరిగితే అంతగానూ వారిలో కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే లెక్క ప్రకారం 2011 నుంచి 2017ల మధ్య కాలంలో నమోదైన తలసరి ఆదాయ వివరాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది.