జాతీయ వార్తలు

హామీల అమలులో కేంద్రం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: మూడేళ్ల కాలంలో ఏన్డీఏ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమయిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ ‘తీన్‌సాల్ నా రోటి నా దాల్ - హజారో సవాల్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆ పార్టీ నాయకులు సీతారాం ఏచూరి, బృందకారత్ తదితరులు విడుదల చేశారు. ఈసందర్భంగా సీతారాం ఏచూరి విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రంలో ఏన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందని మండిపడ్డారు. బిజెపి సర్కారు ఆర్‌ఎస్‌ఎస్ అసలు అజెండాను అమలు చేస్తుందని, ఈ మూడేళ్ల కాలంలో ప్రజలను మత,కుల ప్రతిపాదికన విభజించిందని ఆయన దుయ్యబట్టారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన అనంతరం పెద్ద కార్పోరేట్ సంస్థల అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. భారతదేశం అభివృద్ధి ఎలా ఎదుగుతుందో తెలియడానికి పేదలు మరింత పేదలవుతుంటే, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా అభివృద్ధి కొందరి అభివృద్ధి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ బిజెపి ప్రభుత్వ కాలంలో ఐటీ రంగం లో 56 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు చెప్పారు. ముఖ్యంగా దేశంలో పరిశ్రమలు, సేవ లు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల వృద్ధి రేటు పడిపోయిందని ఆరోపించారు. దేశంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, గడచిన మూడేళ్లుగా సంవత్సరానికి 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయని చెప్పా రు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం మూడేళ్లుగా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అలాగే విదేశాల నుంచి దిగుమతి సుంకం లేకుండా గోధుమలు దిగుమతి చేసుకుంటున్నారని, ఇది దేశంలోని రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏం అభివృద్ధి చేశారని బిజెపి శ్రేణులు దేశ వ్యాప్త సంబరాలు జరుపుకుటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ కల్పన, ఆహార భధ్రత, రైతు పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని ఏచూరి వెల్లడించారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో మొదటి ఏడాది కేవలం 1.3 లక్షలు, రెండో ఏడాది 2.31 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని చెప్పారు. ఈ మూడేళ్లలో ఉపాధి కల్పన శాతం గత ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువగా నమోదైందని ప్రభుత్వానికి చెందిన లేబర్ బ్యూరో వెల్లడించిందని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడం, ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం, అమెరికాను అనుకూలంగా వ్యవహారిస్తుందని విమర్శించారు. కేంద్రంలోని ఏన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం బలపరుస్తామని స్పష్టం చేశారు.
చిత్రం: మోదీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేస్తున్న సీతారాం ఏచూరి, బృందా కారత్