తెలంగాణ

కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురునందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి మొత్తం 15 రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ద్వారా మొత్తం 2437 పోస్టులను భర్తీ చేయనున్నారు. రేపటి నుండి కొత్త నోటిఫికేషన్లు విడుదల అవుతాయని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ చక్రపాణి చెప్పారు. గురుకుల నోటిఫికేషన్లనీ రెండు రోజుల్లో ఇస్తామని అన్నారు. ఈ నెల 29, 30లలో పిజిటి మెయిన్ పరీక్ష, టిజిటి పరీక్షను వచ్చే నెల రెండో వారంలో నిర్వహిస్తామన్నారు. మరో పక్క గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైందని, గ్రూప్-2 ఫలితాలను శుక్రవారం నాడు విడుదల చేస్తామని గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు రేపటినుండి వెబ్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
గ్రూప్-1 సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తయిన తర్వాత గ్రూప్-2 అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. పైరవీకారులు, దళారులను నమ్మవద్దని ఉద్యోగార్థులను హెచ్చరించారు. అవసరమైన సర్ట్ఫికేట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అనుమతించి, ఇంకా జారీ చేయాల్సిన నోటిఫికేషన్లు ఏవీ కమిషన్ వద్ద పెండింగ్‌లో లేవని చైర్మన్ స్పష్టం చేశారు. ఇంత వరకూ 15వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. గ్రూప్-2లో సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను పిలుస్తామని అన్నారు. గ్రూప్-2లో 1032 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. డిఎస్సీలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తమకు ఇంకా ప్రభుత్వం నుండి సమాచారం రాలేదని చక్రపాణి తెలిపారు.
నేడు నోటిఫికేషన్లు జారీ
15 కొత్త రిక్రూట్‌మెంట్‌ల నోటిఫికేషన్లు 2వ తేదీన విడుదల చేస్తున్నారు. వీటన్నింటికీ దరఖాస్తులు సమర్పించుకునేందుకు ఈ నెల 6 నుండి అవకాశం కల్పిస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇనస్పెక్టర్ బాయిలర్స్, ఫారెస్టు కాలేజీ ప్రొఫెసర్లు, లైబ్రరియన్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు జూన్ 11 వరకూ ఇచ్చారు. మిగిలిన అన్ని పోస్టులకు జూన్ 24లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, పిడిలు, లైబ్రరియన్లు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్, జూనియర్ కాలేజీ పిడిలు, జూనియర్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీల్లో లైబ్రరియన్లు, స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పోస్టులకు ప్రిలిమినరీ , మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఫారెస్టు కాలేజీల్లో ప్రొఫెసర్లు, లైబ్రరియన్ల పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూలు మాత్రం నిర్వహిస్తారు. మిగిలిన రిక్రూట్‌మెంట్లకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఉన్న కొన్ని పోస్టులకు ఆ పరీక్షను జూన్ 16న నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష ఉన్న పోస్టులకు మెయిన్ ఎగ్జామ్ ఆగస్టు 12, 13 తేదీల్లో ఉంటుంది. వెటర్నరీ అసిస్టెంట్లకు జూలై 23న, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆగస్టు 5న, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు ఆగస్టు 5న, ఇనస్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్‌కు ఆగస్టు 5న, డిప్యుటీ సర్వేయర్లకు ఆగస్టు 20న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టులకు ఇంటర్వ్యూలు మాత్రమే నిర్వహిస్తారు.