జాతీయ వార్తలు

కోర్టు వెలుపల సెటిల్‌మెంట్లకు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. కక్షిదారులు కోర్టు వెలుపల కేసులు పరిష్కరించుకునేలా ప్రోత్సహించడంతోపాటు దీనికి కొత్త చట్టం తీసుకురానుంది. కోర్టులపై సాధ్యమైనంత వరకూ భారం తగ్గించేలా చూడాలన్నదే ప్రభుత్వ యోచన. స్వచ్ఛందంగా, మధ్యవర్తుల ద్వారా కోర్టు వెలుపల కేసులు పరిష్కరించుకునేలా కొత్త చట్టంలో మార్గదర్శకాలు రూపొందించాలని న్యాయవ్యవహారాల విభాగాన్ని కోరింది. సింగ్‌పూర్‌లో అమల్లో ఉన్న చట్టం తరహాలో కొత్త చట్టం ఉండాలని ఇటీవల జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కోర్టు వెలుపల కేసులు పరిష్కరించుకుంటే పలు రాయితీలు కల్పించాలన్నది ప్రపంచ బ్యాంక్ నివేదికలో పేర్కొన్నారు. దీనిపైనే టాస్క్ఫోర్స్ సమావేశంలో చర్చించారు. మధ్యవర్తుల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులు వాపసుచేయడం, ఆదాయపన్నులో రిబేట్ కల్పించడం చేయాలని నివేదికలో తెలిపారు. ప్రీ లిటిగేషన్ మీడియేషన్ సెంటర్లలో చిన్నకేసులు, కుటుంబ తగాదా కేసులు పరిష్కరించిన విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి టాస్స్‌ఫోర్స్ సమావేశంలో తెలిపారు. మొత్తం 47000 కేసులు పంపగా 17వేలు పరిష్కారమయ్యాయని అన్నారు. భార్యాభర్తల గొడవలకు సంబంధించి కేసులు కోర్టు వెలుపల పరిష్కరించుకోవడం సులభమని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా చట్టం తీసుకొస్తే యజమాని- అద్దెదారులు, పారిశ్రామిక వివాదాలు పరిష్కరించుకోడానికి వీలుంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మధ్యవర్తుల ద్వారా కేసులు పరిష్కరించుకోడానికి దేశంలో ఇంతవరకూ ఎలాంటి చట్టం లేదు.