జాతీయ వార్తలు

రాజ్యాంగంలోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: గో విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం కూడా దేశ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. కేంద్ర నోటిఫికేషన్ ఏ విధంగానూ రాష్ట్రాల చట్టాల అమల్లో జోక్యం చేసుకునేది కాదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేసినప్పటికీ పరిస్థితిలో వేడి తగ్గలేదు. కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో పరిస్థితిని శాంత పరిచేందుకు జైట్లీ మీడియాతో మాట్లాడారు. పశువుల సంతలు అనేవి రైతుల కోసం ఉద్దేశించినవే తప్ప వ్యాపారవేత్తల కోసం ఏర్పాటుచేసినవి కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర శాసనలో అత్యంత కీలకమైన భాగం ఇదేనని కబేళాలకు పంపించడం కోసమే పశువులను విక్రయించకూడదన్నదే ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.‘ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. గోవధకు సంబంధించి ఏ రకమైన శాసనమూ లేదు. కొన్ని రకాల పశుగణాలను పరిరక్షించి తీరాల్సిందేనని రాజ్యాంగంలోని 48వ అధికరణ(ఆదేశిక సూత్రాలు) స్పష్టం చేస్తోందని జైట్లీ వివరించారు. అయితే ఈ అధికరణలో పేర్కొన్న గోవధ నిషేధం అన్నది తప్పనిసరిగా అమలుచేసి తీరాల్సిన బాధ్యత కాదన్న వాదన వినిపిస్తోంది, ఇదే అంశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లేవనెత్తారు. కేంద్ర ఆదేశంపై నిప్పులు చెరుగుతున్న ఆమె మాంసం వ్యాపారం చేసే బిజెపి సన్నిహిత వ్యాపారాలకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నోటిఫికేషన్ పరిధి నుంచి గేదెలను మినహాయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ విధంగా గేదెలను వధించడానికి అనుమతించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. కాగా బీఫ్ పార్టీలు మానవత్వ వ్యతిరేకమైనవి వాదిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ఈ వ్యవహారాన్ని సరికొత్త మలుపుతిప్పింది. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల జరుగుతున్న ఈ తరహా పార్టీలను నిరసించింది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ జైపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బీఫ్ పార్టీలు చేసుకున్న వ్యక్తులు 120 కోట్ల మంది జనాభాలో అతికనిష్ఠ భాగమాన్నారు. ఆవుపాలు ఔషధంలా పనిచేస్తే పశుమాంసం అన్నది శరీరాన్ని రోగగ్రస్తంగా మారుస్తుందని పేర్కొన్నారు.