సబ్ ఫీచర్

ముద్దొచ్చే ముద్దమందారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హై బ్రిడైజేషన్ పుణ్యమా అని ప్రస్తుతం 150 రకాల మందారాలు అం దుబాటులో ఉంటున్నాయి. మందార వివిధ కొమ్మలు, రెమ్మలతో గుబురుగా పెరిగే మొక్క. దాదాపు ఆరడుగుల ఎత్తు పెరుగుతుంది. మామూలుగా ఎరుపు, మెజంటా రంగుల మందారాలు సహజ రూపం గలవి.
హైబ్రిడైజేషన్‌తో ఇప్పుడు మందా ర రంగుల షేడ్లకు లెక్కేలేదు. తెలుపు, పసుపు, నారింజ, కనకాంబరాలు ఉన్నాయి. వాటిల్లో మరింకెన్నో షేడ్లతో ఏక రెక్క ముద్ద రకాలతో చూసే కొద్దీ చూడాలనిపిస్తాయి.
మందార పూలు పూచిన మొక్కలు తోటంతా అందాన్ని ఇస్తాయి. అరవిరిసిన మందారాలు ఇంటికే రమణీయతను చేకూర్చుతాయి. ముదురాకు పచ్చదనంతో ఆకులు మెరిసిపోతుంటాయి. మందారమాల కుటుంబానికి చెందింది. ఇది మన నేటివ్ ప్లాంట్ కావడంతో సులువుగా పెంచుకోవచ్చు.
వీటిని పెంచాలంటే వేర్లతో పనిలేదు. ఒక అడుగు గట్టి కొమ్మను తీసుకుని ఆకులన్నీ తీసేసి మట్టిలో లోతుగా పాతాలి. తడి ఆరకుండా నీళ్ళు పోస్తుంటే మూడువారాల్లో కొమ్మకు చిగుర్లు తొడగటం మొదలవుతుంది. మరోవారంలో వేరు కూడా దృఢంగా నాటుకుంటుంది. వేరు ఆకు బాగా ఎదిగాక దాన్ని తీసి కుండీలో పెట్టుకోవాలి. కొన్ని రోజులయ్యాక ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు.
ఎక్కువగా పెంచుకునే కొన్ని మందారాలు ఏమిటంటే-
పెర్సిలాం కస్టర్ - ఇది చిన్న పొదగా ఉంటుంది.
హనాయ్ వైట్ - ఐవరీ రంగు పూలతో గుబురుగా పెరిగే మొక్క
కళ్యాణి - ఇది పొడవుగా పెరిగి ఏడాదంతా పూస్తుంది.
కాలిజబ - అనేక కొమ్మలతో పొడవుగా వుంటుంది
డెఫోడిల్ - ఇది పసుపుపచ్చ ముద్ద మందారం
హైబిస్కస్ కొలినస్ - పర్పుల్ కలర్ పూలతో నిండుగా ఉంటుంది.
మందార పూలను వెంట్రుకల అభివృద్ధికి, కొన్ని ప్రాంతాలలో టీ పొడిలో కలిపి టీగా తయారుచేసి ఉపయోగిస్తుంటారు.

- హిమజారమణ