Others

ఆర్టిస్టులందు ఈ టైపు వేరయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా పనిని కొత్తతరహాలో చేయడమే సృజనాత్మకత. జయాపజయాలను శాసించేది మన ఆలోచనా విధానమే. ఏదైనా పనిచేయాల్సి వచ్చినపుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు విభిన్నంగా ఆలోచించి విజయాలు సాధిస్తుంటారు. ఆటపాటలు, వ్యాపారం, పరిశ్రమ, విద్య, విజ్ఞానం, రచన, చిత్రకళ, సినిమా తదితర రంగాల్లో ఇది ఆవిష్కృతమవుతుంటుంది. దీనినే అక్షర సత్యం చేసింది కీరా రాత్సోవ్. అలనాటి గతకాలపు గుర్తులైన టైపురైటర్‌తో అరుదైన కళని సొంతం చేసుకుంది కీరా రాత్సోవ్. కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వచ్చాక టైప్‌రైటర్‌ని ఎవరు వాడతారు. అదే టైప్ రైటర్‌తో ఎన్నో అద్భుతాలు చేసింది కీరా రాత్సోవ్. లండన్‌కి చెందిన ఈ టైపు కళాకారిణి ఒక్కో చిత్రానికి దాదాపు 100 గంటలు కష్టపడి కళాకృతిని ఆవిష్కరిస్తుంది. చిత్రమైపోయాక ఆమె కష్టమంతా మరచిపోతుంది. బ్రష్‌లనీ.. స్ట్రోక్స్‌ని వదిలేసి ఆ స్థానంలో కేవలం టైపు రైటర్‌మీద ఉన్న ఆల్ఫాబెట్స్‌తో అంకెలతో గుర్తులతో ఒక్కో చిత్రాన్ని పూర్తిచేస్తుంది. ఎన్నో రూపాలను టైపురైటర్‌తో మన ముందు నిలబెడుతుంది. ప్రముఖుల క్యారికేచర్లనూ... ప్రకృతి దృశ్యాలను.. తాను వాడే టైప్ మిషన్ బొమ్మనూ టైపు రైటర్‌తో చిత్రించడం ఆమెకే సాధ్యమేమో.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి