మంచి మాట

సద్భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకలో మనుషులందరూ సమానమే. మృత్యువులోను సమానమే. చావుపుట్టుకలే కాదు సుఖదుఃఖాలు, రాగద్వేషాలు కూడా సమానమే. మనుషులల్లో కొందరు ఎదుగుతూ మంచివారిగా భక్తితత్పరులుగా పెరిగితే మరికొందరు అహంభావంతో పెరుగుతారు. మమ్మల్ని మించినవారు లేరని విర్రవీగుతారు. మేము చేస్తున్నది మాత్రమే యోగ్యమైనవి, అదే సరైనది సరిగాకున్నప్పటికీ వాదిస్తారు. కొందరు పదవీఅహంకారంతో మసలి ఇతరులను చులకన చేస్తారు. మరికొందరుజ్ఞానాహంకారంతో చులకన చేస్తారు.
అహంకారాన్ని పెంచే జ్ఞానం శాశ్వతానందాలను ఇవ్వలేదు.నిజం చెప్పాలంటే అది అజ్ఞానమే. సర్వవ్యాపి అయన భగవంతుని దృష్టిలో పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సమానమే. ఎవరూ ఎక్కువగాదు మరెవ్వరూ తక్కువకాదు. మిడిమిడి జ్ఞానంతో మేమంటేమేమే అధికులమని విర్రవీగుతారు. అందులో మండే ఎండ ఎద్దుకు ఒకటే పండితుడికీ ఒకటేనని చెప్తారు.
జలాశయాల్లో నీరు కాని, చెట్లనుంచి వచ్చే గాలి కాని సర్వసమానంగా ఉంటుంది. వీరు బీదవారని తక్కువ వీయదు. ధనవంతులని ఎక్కువగా వీయదు. ప్రకృతి నేర్పే పాఠాలను మానవుడు ఇంగిత జ్ఞానంతో గ్రహించాలి. త్యాగగుణాన్ని అలవర్చుకోవాలి. ప్రతి మనిషి పుట్టినందుకు కష్టపడాలి. ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. ఒక్కరు సంపాదించి తరతరాలు కూర్చుని తిన్నా కరగని గనులను ఏరికూర్చక్కర్లేదు. అట్లాచేస్తూ వారి వంశనాశనాన్ని వారే చేతులారా చేస్తున్నట్టు అవుతుంది. భావితరాలను దివ్యజీవనులుగా చేయల్సిన అవసరం నేటి తరంలో ని ప్రతి పెద్దపైనా ఉంది. అంతేకాని, వారిని సోమరులుగా చేయడానికి అవసరమైన ధనసంపత్తిని, వాహనసంపత్తిని చేకూర్చి పెట్టక్కర్లేదు.
మన భారతదేశంలో ఎందరో ఋషులు, యోగులు, గురువులు, మహాత్ములు మానవాళి సుఖ సంతోషాలకోసం ఎంతో కృషి చేశారు. సత్సంగాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వారు చూపిన మార్గంలో నడిచినచో మనిషిలో సద్భావననలు ఉద్భవించి, మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. వారు ఎవరూ ధనవస్తువాహన సంపత్తిని పోగుచేయలేదు. కేవలం జ్ఞానాన్ని పోగుచేశారు. ఇంకా ఇంకా ఆ జ్ఞానపుంజాలు వెలువడుతూనేఉన్నాయ. వాటిని ఎంత శోధించినా వాటి చివర కనిపించడం లేదు. అటువంటి జ్ఞానపుంజాల వెదుకులాట జరుపుతూ నిత్యజీవితంలో సుఖసంతోషాలు పొందడానికి వారు మార్గాన్ని సూచించారు. ఆ మార్గంలో నడిస్తే భవిష్యత్తు, వర్తమానం రెండూ సువర్ణమయం అవుతాయ.
భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప ఆయుధం మాట. నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు పెద్దలు. మాటలతో ఎదుటివారి మనస్సును ఆకట్టుకొనవచ్చు. మాటల్లో ఉండే నాల్గు రకాల దుష్కర్మలను దూరం చేస్తూ మాట్లాడి ఎదుటివారికీ తనకు మంచిని కలుగచేసుకొనేవారే జ్ఞానులు. 1.పౌరుష్యం 2.అనృతం 3.వైశూన్యం 4.అసంబద్ధ ప్రలాపం మాటల్లో ఉండే ఈ అసందర్భాలను తీసివేయడం ప్రతివారు చేయాల్సిన మొదటిపని. మనిషి తోటివారికి సహాయపడాలి. సమాజానికి ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వాలి. రంతిదేవుడిలా, దానకర్ణుడిలా, శిబి చక్రవర్తిలా, వామనునిలా ప్రతిఫలం ఆశించకుండా దానధర్మాలు చేయాలి. దానం చేయడం వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. ఇతరుల సొమ్ము ఆశించకుండా జీవించాలి. నీతి నిజాయితీ, నైతిక విలువలతో కూడిన జీవన విధానం అలవర్చుకోవాలి. ప్రతిరోజు ఆచరించే కర్మలన్నీ సద్భావనంతో ఆచరించాలి. సత్కర్మలే మనిషికి మోక్షద్వారం వైపు నడిపిస్తాయి. మనిషి జీవితాన్ని సార్థకం చేస్తాయి.
అపుడే మనిషి పుట్టినపుడు ఎంత నిర్మలంగా ఉంటాడో జీవిత పర్యంతమూ అట్లాగే ఉంటాడు. మాట్లాడే మాట, ఇతరులకు మేలు చేయాలన్న హృదయం మంచివైతే దుష్ట్భావనలు ఒకవేళ కలిగినా వాటిని అణిచేసి సద్భావనలు పైకితెచ్చే ప్రయత్నం చేస్తే మనిషి సజ్జనుడుగానే మిగులుతాడు. ఇలా జరగాలంటే మంచిమిత్రులతో స్నేహం చేయాలి. మంచిపుస్తకాలను చదవాలి. అపుడు మానవవికాసం జరుగుతుంది. జగతికి మేలు జరుగుతుంది.

- జి. కల్యాణి