క్రీడాభూమి

ఆర్‌సిఎ అధ్యక్షుడిగా జోషి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 2: రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సిఎ) అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిపి జోషి ఎన్నికయ్యాడు. నిజానికి మే 29న ఆర్‌సిఎ కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. అయితే, హై కోర్టులో కేసు కొనసాగుతున్నందున, కోర్టు ఆదేశాలు అందే వరకూ ఫలితాలను జారీ చేయరాదని నిర్ణయించారు. శుక్రవారం కోర్టు అనుమతించడంతో ఫలితాలను ప్రకటించారు. ఐపిఎల్‌కు మొదటి కమిషనర్‌గా వ్యవహరించిన లలిత్ మోదీ కుమారుడు రుచిన్ మోదీపై జోషి ఐదు ఓట్ల తేడాతో గెలిచినట్టు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జోషికి 19, రుచిర్‌కు 14 ఓట్లు వచ్చాయి. ఇలావుంటే, ఎన్నిక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, బ్యాలెట్ బాక్స్‌లను అధికారుల పర్యవేక్షణలో ఉంచడం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని రుచిర్ ఆరోపించాడు.