క్రీడాభూమి

సెవాగ్‌కు పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 2: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు అనిల్ కుంబ్లే విముఖత వ్యక్తం చేశాడని, దీనితో అతని స్థానంలో బాధ్యతలను మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించిందని సమాచారం. వేగంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తాయని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అలాంటిదేమీ లేదని, జట్టులోనిగానీ, సపోర్టింగ్ స్ట్ఫాలోగానీ ఎలాంటి మనస్పర్థలు లేవని బిసిసిఐ, సెలక్షన్ కమిటీ పదేపదే ప్రకటిస్తున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌తోనే కోచ్‌గా కుంబ్లే ఒప్పందం ముగుస్తుంది. అతని కాంట్రాక్టును పొడిగించేందుకు బిసిసిఐ సుముఖంగా లేదన్న వాదన వినిపించింది. అయితే, కెప్టెన్ కోహ్లీనే కుంబ్లే వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు బిసిసిఐ వర్గాలు బహిరంగంగానే అంటున్నాయి. కోహ్లీ పట్టుబట్టడం వల్లే కుంబ్లే కాంట్రాక్టును పొడిగించకుండా, కొత్త కోచ్ కోసం దరఖాస్తులను బిసిసిఐ ఆహ్వానించిందని కూడా ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖాముఖాలు చూసుకోలేనంత స్థాయిలో వీరి మధ్య విభేదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? ఏఏ విషయాల్లో ఘర్షణ పూర్వక వాతావరణం ఏర్పడింది? అనే ప్రశ్నలకు టమైన సమాధానం లేదు. కానీ, వీరిద్దరూ ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించుకుంటున్నారని బయటకు వినిపిస్తున్న వార్తల వల్ల తెలుస్తున్నది. టీమిండియాలో ఆటగాళ్ల మధ్య ఆధిపత్య పోరాటం, ఆటగాళ్లు, కోచ్ మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కోచ్‌తో కెప్టెన్‌కు పడకపోవడం అనేది ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ, కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉండేవో అందరికీ తెలుసు. ఇద్దరూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా, సమయం దొరికిన ప్రతిసారీ ఒకరినొకరు విమర్శించుకోవడం కొనసాగుతునే ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ, డంకన్ ఫ్లెచర్ సంబంధాలు అత్యంత నిరాశాజనకంగా కొనసాగాయి. ఫ్లెచర్‌తో ఒప్పందం పూర్తికాకపోవడంతో, టీమిండియాకు డైరెక్టర్ అనే ఒక కొత్త పదవిని సృష్టించి మరీ రవి శాస్ర్తీని బిసిసిఐ రంగ ప్రవేశం చేయించింది. తర్వాతి కాలంలో అతనికే పరోక్షంగా కోచ్ బాధ్యతలు అప్పగించింది. అతనిని పూర్తికాల కోచ్‌గా ఎంపిక చేస్తారన్న వాదన బలంగా వినిపించినప్పటికీ, హఠాత్తుగా సీను మారిపోయింది. దరఖాస్తు చేశాడే తప్ప రేసులో లేడని అందరూ అనుకున్న అనిల్ కుంబ్లేకి ఎవరూ ఊహించని రీతిలో కోచ్ పదవి దక్కింది. అయితే అన్ని ఫార్మాట్స్‌కూ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ మనసు మారిందని అంటున్నారు. పలు సందర్భాల్లో కుంబ్లేతో అతను తీవ్రంగా విభేదించాడని సమాచారం. నిజానిజాలు ఎలావున్నా, కోహ్లీ కారణంగానే కుంబ్లే కాంట్రాక్టును పొడిగించడానికి బిసిసిఐ సుముఖత వ్యక్తం చేయలేదని బలంగా వినిపిస్తున్నది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం కుంబ్లేకు ఇచ్చినప్పటికీ, బిసిసిఐ ఆధ్వర్యంలోని సలహా మండలి అతని పట్ల సానుకూలంగా స్పందిస్తుందా అన్నది అనుమానమే.
కుంబ్లే రాజీనామా?
కోచ్‌గా కొనసాగే ఉద్దేశం లేదంటూ కుంబ్లే రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీతోనే బిసిసిఐతో అతనికి కుదిరిన ఒప్పందం ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో అతను హఠాత్తుగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే, కోహ్లీతో ఉన్న విభేదాలు రోజురోజుకూ ముదురుతున్న తరుణంలో, చాంపియన్స్ ట్రోఫీ ముగిసే వరకూ కోచ్‌గా కొనసాగితే పరువు పోతుందని కుంబ్లే అనుమానిస్తున్నాడని అతని సన్నిహితులు అంటున్నారు. అందుకే, తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగడం మంచిదనే అభిప్రాయాన్ని అతను వెల్లడించినట్టు చెప్తున్నారు. కుంబ్లే అర్ధాంతరంగా తన బాధ్యతలను విడిచిపెట్టి, లండన్ నుంచి స్వదేశానికి బయలుదేరితే, అతని స్థానంలో ఎవరు కోచ్‌గా ఉండాలనే ప్రశ్న తలెత్తుతున్నది. సెవాగ్ ఇప్పటికే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడంతో, తాత్కాలికంగా అతనికే పగ్గాలు అప్పచెప్పాలని బిసిసిఐ ఒక నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అదే జరిగితే, కోచ్ ఎంపిక సమయంలో అతని పేరునే ప్రధానంగా పరిశీలించే అవకాశాలున్నాయి.