మెయన్ ఫీచర్

గోమాతనూ వదలని ఓటు బ్యాంకు రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ సమాధానం దొరకని కొన్ని చిక్కు ప్రశ్నలను పరిష్కరించే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ‘సమస్యల బూచి’ని చూపించి తమ రాజకీయ, సాంఘిక ప్రయోజనాలు ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీలకు, శక్తులకు, వ్యక్తులకు, కొన్ని మీడియా సంస్థలకు ఇది మింగుడు పడడం లేదు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, కొన్ని సంస్థలు, ఒక వర్గం మీడియా అభూత కల్పనలతో, అసంబద్ధ వాదనలతో నానా రభస చేస్తున్నాయి. దేశంలో గోవధ నిషేధం అత్యధిక ప్రజల ఆకాంక్ష. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో కూడా దీనిపై విస్తృత చర్చలు జరిగాయి. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం జరగాలని, దీనికి రాజ్యాంగ భద్రత ఉండాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గోవధ నిషేధం అంశాన్ని మతపరమైన అంశంగా పరిగణించి, మరొక వర్గాన్ని సంతృప్తిపరచేందుకు అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని రాజకీయ వ్యవస్థ దీనిని ‘కోతి పుండు బ్రహ్మరాక్షసి’లా తయారుచేసింది. వివిధ స్థాయిల్లో కోర్టులు కూడా వివిధ సందర్భాలలో ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా తాత్సారం చేశాయనే చెప్పుకోవాలి.
జంతు హింస నిరోధక (సజీవ జంతువుల మార్కెట్ నియంత్రణ) చట్టం కింద 23 మే 2017న కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు చేసిన కొన్ని సూచనలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను ఇచ్చింది. ఇందులో ప్రధానంగా పశువుల సంతలో ఆవులు, ఎద్దులు తదితర జంతువులను, పశువులను వధశాలలకు అమ్మకుండా నిషేధం విధించారు. ఈ అంశాన్ని సంకుచిత రాజకీయ కోణం లోంచి చూస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ఇది గోవధ నిషేధాన్ని పరోక్షంగా అమలుచేయడమే అంటూ నానా యాగీ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు నడిరోడ్ల మీద ఆవులను చంపి వాటి పచ్చి మాంసం తింటూ ఫొటోలకు పోజులిచ్చి నిరసనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించారు. మద్రాస్ హైకోర్టు ఈ ఆదేశాలపై నాలుగు వారాల పాటు ‘స్టే’ మంజూరు చేసింది. ‘సెక్యులరిజం’ పదానికి అర్థం తెలియని ఓ వర్గం మీడియా సంస్థలు రోజుల తరబడి ఈ దృశ్యాలు చూపిస్తూ గంటల తరబడి చర్చా వేదికలు నిర్వహించాయి. జంతుహింసకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను ఒక జాతీయ సంక్షోభంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి.
గోవధ నిషేధంపై యాగీ చేస్తున్న రాజకీయ పార్టీలకు, సంస్థలకు దీని వెనుక ఉన్న చారిత్రిక నేపథ్యం తెలియదు. తెలిసినా తమ సంకుచిత ధోరణి కారణంగా దీన్ని బయటపెట్టరు. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో సంపూర్ణ గోవధ నిషేధం ప్రముఖ అంశంగా పలుసార్లు చర్చకు వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాణ సమితి (్ళ్యశఒఆజఆఖళశఆ ఒఒళౄఇక) లో సభ్యుడైన గోపాల్‌దాస్ దీన్ని ద్వాపరయుగం (కృష్ణుడి కాలం) నుంచి వస్తున్న నాగరికతకు సంబంధించిన అంశంగా పేర్కొంటూ దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం విధించాలని వాదించారు. అంటరానితనం నిర్మూలన అంశంలానే గోవధ నిషేధం అంశాన్ని పరిగణిస్తూ దీన్ని రాజ్యాంగంలోని వౌలిక హక్కుల కింద పొందుపరచాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాణ సమితిలోని ఇతర సభ్యులు శిబ్బన్‌లాల్ సక్సేనా, ఠాకూర్‌దాస్ భార్గవ, రామ్‌నారాయణ్ సింగ్, రామ్‌సహాయ్, రఘువీరా, ఆర్.వి.్ధలేకర్, చౌదరి రణ్‌బీర్‌సింగ్ తదితరులు సంపూర్ణ గోవధ నిషేధాన్ని సమర్ధించారు. వ్యావసాయక దేశమైన భారత్‌లో పశుసంపదను కాపాడుకోవాలని, వాటిని వధించకుండా చూస్తేనే దేశ ఆర్థికస్థితి బాగుంటుందన్నది వీరి వాదన. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధాన్ని అమలుచేయడం ఇష్టం లేని కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు ఒక విచిత్రమైన వాదన తీసుకువచ్చారు. రాజ్యాంగంలోని వౌలిక హక్కులు మనుషులకు మాత్రమే ఉంటాయని పశువులను వౌలిక హక్కుల శ్రేణిలోకి తీసుకురాలేమని వాదించారు. చివరకు ప్రజా ఒత్తిడికి లొంగిన కాంగ్రెస్ నాయకులు గోహత్యా నిషేధాంశాన్ని నిర్దేశక సూత్రాల కింద (జూళషఆజ్పళ -జశషజఔళఒ) చేర్చడానికి అంగీకరించారు. ఎట్టకేలకు నిర్దేశక సూత్రాలలోని ఆర్టికల్ 48 కింద చేర్చిన ఈ అంశంలో భారత ధార్మిక భావనలను తప్పించారు. పశుసంతతి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ యోగ్యమైన, ఆర్థిక అవసరాలు తీర్చే పశువులను వధించకుండా చూడాలని ఇందులో పేర్కొన్నారు. గోవధ నిషేధాన్ని నీరుగారుస్తూ దొడ్డిదారిన ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని పలువురు సభ్యులు అప్పట్లో వ్యతిరేకించారు. వౌలిక సూత్రాలలో చిత్తశుద్ధిలేని ‘ఆర్టికల్ 48’ పలుమార్లు సుప్రీం కోర్టులో కూడా వివాదాంశంగా మారింది. వివిధ రాష్ట్రాలు సంపూర్ణ గోవధ నిషేధంపై చేసిన చట్టాలపై అభిప్రాయం చెప్పవలసిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గోవధ నిషేధంపై రాజ్యాంగబద్ధత గురించి వివరించాల్సిందిగా వీరు కోరారు. గోవధ నిషేధంతో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని, మత స్వాతంత్య్రానికి దెబ్బతగులుతుందని కొంతమంది వాదించారు. సుప్రీం ఈ వాదనలను కొట్టివేస్తూ రాష్ట్రాలు చేసిన చట్టాలను ఆమోదించినప్పటికీ తన అభిప్రాయాలను పూర్తిగా ఆర్థిక అంశాలపైన కేంద్రీకరించింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో పశువుల అక్రమ రవాణా అంశంపై సుప్రీం కోర్టు చేసిన సూచనలతోపాటు ‘జంతు హింస నివారణ చట్టం-1960’లోని అంశాలను ఆధారంగా చేసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆదేశాలను జారీచేసింది. గోవధను నిషేధిస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను ఆమోదిస్తూ 26 అక్టోబర్ 2005న సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌తోపాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఏదో ఒక రీతిన గోవధను నిషేధించాయి.
దశాబ్దం క్రితం వేసిన అంచనా ప్రకారం దేశంలో అధీకృత పశువధశాలలు 3600 కాగా అనధికృత పశువధశాలలు దాదాపు 30వేల వరకూ ఉన్నాయి. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఆరు (6) అధీకృత పశువధశాలలు కాగా 3100 అనధికృత పశువధశాలలు ఉన్నాయి. వీటిని మూసివేసే ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి. మన దేశంపై ఇస్లామిక్ దాడులు ప్రారంభమయిన తరువాత గోహత్యలు పెరిగాయి. అరబ్ దేశాల్లో సాధారణ పరిస్థితుల్లో గొర్రెలు, మేకలు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒంటెలను బలి ఇచ్చేవారు. ఆ దేశాల్లో గోసంతతి లేకపోవడం ఇందుకు కారణం. భారత్‌లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడ్డాక బక్రీద్ సందర్భంగా ఆవులను బలి ఇవ్వడం ప్రారంభమైంది. మధ్యలో కొంతకాలం- 1801 నుంచి 1839 వరకూ పంజాబ్ మహారాజు రంజిత్‌సింగ్ తన సామ్రాజ్యంలో గోవధను నిషేధించాడు.
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గోవధ విశృంఖలంగా పెరిగింది. యూరోపియన్‌లు గోమాంస భక్షణ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో మొట్టమొదటి పశువధశాలను 1760లో కోల్‌కతా నగరంలో రాబర్ట్ క్లైవ్ ఏర్పాటుచేశాడు. ఇందులో రోజుకు 30,000 గోవులను వధించేందుకు అవకాశం ఉన్నది. ఆ తరువాతి కాలంలో మద్రాస్, ముంబయిల్లో కూడా ఇటువంటి గోవధశాలలను ఏర్పాటుచేశారు. 1870 ప్రాంతంలో నామ్‌ధారిసిఖ్‌లు ‘కకువా’ ఉద్యమాన్ని ప్రారంభించి గోవధ నిషేధానికై ఉద్యమించారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆర్య సమాజ్ నిర్మాత స్వామి దయానంద సరస్వతి గోవధ నిషేధానికై ఉద్యమిస్తూ గోసంవర్ధనా సభలను ఏర్పాటుచేశారు. నెమ్మది నెమ్మదిగా ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించింది. తరువాతి కాలంలో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్‌రాయ్, మదన్ మోహన్ మాలవీయ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, పురుషోత్తమ్ దాస్ టాండన్ లాంటి ప్రముఖ దేశభక్తులు సంపూర్ణ గోహత్యా నిషేధానికై ఉద్యమించారు.
కాగా, భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గోవధ నిషేధాన్ని వ్యతిరేకించారు. 20 డిసెంబర్ 1950న వివిధ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తూ గోవధ నిషేధ చట్టాలు చేయవద్దని చెప్పారు. ‘అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేస్తాను తప్ప గోవధ నిషేధ చట్టాన్ని అనుమతించబోనని’ నెహ్రూ లోక్‌సభలో ప్రకటించారు. దేశంలో సంపూర్ణ గోవధ నిషేధం జరగాలని జయప్రకాశ్ నారాయణ 1966లో ఇందిరాగాంధీని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పలు సందర్భాలలో గోవధ నిషేధానికై ప్రయివేట్ మెంబర్స్ బిల్లులను ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు గోవధను నిషేధిస్తూ చట్టాలు చేయాలని వినోబా భావే 1979లో నిరాహార దీక్షలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండీ నేటివరకూ గోవధ నిషేధానికై పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ, ఓటు బ్యాంక్ రాజకీయాలకు, సంతుష్టీకరణ విధానాలకు అలవాటుపడ్డ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు ఇందుకు అంగీకరించలేదు. మన దేశంలో గోవును దైవంగా చూడడంతోపాటు సంపదగా కూడా భావిస్తారు. గోసంపదను రక్షించుకోవడం మన తక్షణ సామాజిక అవసరం. ఈ దిశలో ఒక చిన్ని ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అసాంఘిక శక్తులు రభస సృష్టిస్తున్నాయి. దేశ అవసరాల దృష్ట్యా గోసంతతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉన్నది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113