అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: ఉగ్రవాదం అంతర్జాతీయ పెను సవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ జాడ్యాన్ని రూపుమాపాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఏవిధంగానూ నిధులను గానీ, ఆయుధాలను గానీ అందజేయడానికి వీల్లేదని పాకిస్తాన్‌కు పరోక్షంగా చురక వేశారు. అన్ని రకాలుగా ఉగ్రవాద మార్గాలను మూసివేయడానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాలని శుక్రవారం నాడిక్కడ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశంలో జరిగిన చర్చ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. కాశ్మీరీ మిలిటెంట్లకు పాకిస్తాన్ ఆర్థిక, ఆయు ధ సహకారాన్ని అందించడాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. మొత్తం మానవాళికే ఉగ్రవాదం శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే అణచివేయాలని ఉద్ఘాటించారు. ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే పరిగణించి దాని అంతు చూడాలన్నారు. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రియా మాల్డోవాలకు చెందిన నేతలతో పాటు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టర్స్ కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదానికి సంబంధించి భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను మోదీ ఈ సందర్భంగా చాటిచెప్పారు. ఉగ్రవాదం నిర్వచనానికి సంబంధించి, అలాగే వారికి సహాయాన్ని అందిస్తున్న వారి విషయంలోనూ అంతర్జాతీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలన్న తీర్మానం గత నలభై సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. కేవలం మొసలికన్నీరు కార్చడం తప్ప ఉగ్రవాద నిర్వచనానికి సంబంధించి ఏ రకమైన చర్చ జరగలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ తీర్మానంపై చర్చిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా చెప్పడం తనకెంతో ఆనందం కలుగుతోందని అన్నారు. ఉగ్రవాదులు ఆయుధాలు తయారుచేసుకోరని వారికి కొన్ని దేశాలు వీరికి సరఫరా చేస్తున్నాయంటూ పాకిస్తాన్‌పై మళ్లీ పరోక్షంగా ధ్వజమెత్తారు. అలాగే ఉగ్రవాదులు కరెన్సీ ముద్రించరని, మనీలాండరింగ్ ద్వారా వీరికి కొన్ని దేశాలు నిధులను అందిస్తున్నాయని తెలిపారు. అలాగే ఉగ్రవాదులకు సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండదని, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ఉండవని పేర్కొన్న ఆయన ఈ సౌకర్యాన్ని వీరికి కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంచి టెర్రరిస్టు, చెడ్డ టెర్రరిస్టు అన్న భావననుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని అణచివేయడమన్నది మానవత్వానికి సంబంధించిన అంశమని, దీన్ని ఉమ్మడి శక్తితోనే ఎదుర్కోవాలన్నారు. గత నలభై సంవత్సరాలుగా భారతదేశం సీమాంతర ఉగ్రవాదానికి లోనైందని, వేలాదిమంది అమాయకులు దీనికి బలయ్యారని గుర్తుచేశారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగానే ప్రపంచ దేశాలు పరిగణించాయని, 9/11 తర్వాత గానీ ఉగ్రవాదం ఎంత తీవ్రమైందో ప్రపంచ దేశాలకు తెలియరాలేదని మోదీ పేర్కొన్నారు.
చిత్రం: అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ