జాతీయ వార్తలు

‘నేతాజీ’పై కేంద్రం పిల్లిమొగ్గ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 2: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అదృశ్యం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడంటూ ఆ నాటి యూపీఏ సర్కార్ నిర్ణయానే్న తాము పునరుద్ఘాటించామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించి కొత్త వాస్తవాలు వెలుగు చూస్తే వాటిని పునః పరిశీలించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ ఇందుకు సంబంధించి ఇచ్చిన ప్రకటనపై చేతులు దులిపేసుకుంది. 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న నిర్ణయానికి తాము వచ్చినట్టుగా హోం మంత్రిత్వ శాఖ ఓ ఆర్‌టిఐ పిటిషనర్‌కు స్పష్టం చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించి షా నవాజ్ కమిటీ, జస్టిస్ జిడి ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జి కమిషన్ ఇచ్చిన నివేదికలను హోం శాఖ ఈ సమాధానంలో ఉటంకించింది. ముఖర్జి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2006లో అప్పటి యుపిఏ ప్రభుత్వం ఏ వైఖరి అవలంబించిందో దానే్న తాము పునరుద్ఘాటించామని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయానే్న తాము తెలియజేశాము తప్ప నేతాజీ అదృశ్యం వ్యవహారం ముగిసినట్టు కాదని పేర్కొన్న ఆయన కొత్తగా వెలుగు చూసే వాస్తవాలను యోగ్యత కోణంలో పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన వివరించారు. కొత్త వైఖరిని వివరిస్తూ సదరు ఆర్‌టిఐ పిటిషనర్‌కు ప్రభుత్వం అనుబంధ సమాధానం పంపుతోందన్నారు. ఏ ఆధారంతో నేతాజీ మరణించాడని ప్రభుత్వం వెల్లడించిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీయే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారంటూ ఆర్‌టిఐ దరఖాస్తు దారుకు సమాధానంగా కేంద్రం ఇచ్చిన సమాధానంతో తాము ఏకీభవించడం లేదని పశ్చిమ బెంగాల్ బిజెపి కూడా స్పష్టం చేసింది.