రాష్ట్రీయం

పోస్టులు 1032.. అర్హులు 3147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2, 2011నాటి గ్రూప్-1 పోస్టుల ఎంపిక పరీక్ష ఫలితాలను ప్రకటించింది. 2011లో ఇచ్చిన నోటిఫికేషన్ 15 లిమిటెడ్, నోటిఫికేషన్-18 ప్రకారం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుమేరకు ఇరు తెలుగు రాష్ట్రాలు మళ్లీ పరీక్షలు నిర్వహించాయి. తెలంగాణలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను శుక్రవారం వెబ్‌పోర్టల్‌లో ఉంచారు. అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమం ఈనెల 15, 16 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి ఉంటుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని అధికారులు చెప్పారు. గ్రూప్ -1లో 15/2011 నోటిఫికేషన్ ప్రకారం లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌లో ఇద్దర్ని, గ్రూప్-1లో 18/2011 జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం 238 మందిని ఎంపిక చేశారు. డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇక గ్రూప్-2లో 1032 పోస్టులకుగానూ 3147 మంది లిఖిత పరీక్షలో అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు ఒక్కో పోస్టునకు ముగ్గుర్ని ఎంపిక చేశామని కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి చెప్పారు. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా 439, అదనపు నోటిఫికేషన్ ద్వారా 593 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులకు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో సర్ట్ఫికేట్ల పరిశీలన ఈనెల 12నుండి నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరణాత్మక షెడ్యూలును ఇప్పటికే కమిషన్ వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు చెప్పారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇనస్పెక్టర్ పోస్టులకు అభ్యర్ధులు మెడికల్ బోర్డు ముందు హాజరుకావల్సి ఉంటుందని అధికారులు వివరించారు. కాగా జూన్ -1 జారీ చేసిన 15 నోటిఫికేషన్లకు సంబంధించి వివరణాత్మ ప్రకటనలను కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. పోస్టులు, ఖాళీలు, అర్హతలు, ఇతర షెడ్యూలును సిలబస్‌ను ఎంపిక పరీక్ష విధానాన్ని వివరించింది.