అంతర్జాతీయం

పర్యావరణ రక్షణ మన బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 2: చారిత్రక ప్యారిస్ ఒప్పందంతో నిమిత్తం లేకుండా భారత్ పర్యావరణ పరిరక్షణకు త్రికరణ శుద్ధిగా పాటుపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. మొదటి నుంచీ కూడా ప్రకృతి సమతూకాన్ని భారత్ పరిరక్షించుకుంటునే వస్తోందని, దాని దుర్వినియోగానికి ఏ దశలోనూ ఒడిగట్టలేదని వెల్లడించారు. భావితరాల కోసం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా మోదీ తెలిపారు. మూడు రోజుల క్రితం జర్మనీలో కూడా తాము ఇదే విషయాన్ని వెల్లడించానని మోదీ గుర్తుచేశారు.
దాదాపు190 దేశాలు సంతకాలు చేసిన ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం విషయంలో భారత్ అమెరికాకు వంతపాడుతుందా లేక ఇతర దేశాలతో ఇందుకోసం పాటుపడుతుందా? అన్న ప్రశ్నకు‘మేం ఎటువైపుఉంటామన్నది అసలు ప్రశే్నకాదు. భావితరాల కోసమే భారత్ పాటుపడుతుంది’అని బదులిచ్చారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఆరోగ్యకరంగా జీవించే పర్యావరణ పరిస్థితులను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరానికి ఎంతైనా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించినంత వరకూ భారత్ బాధ్యతాయుతంగా ఉంటుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణ దోపిడీని సహించమన్నారు. పారిస్ ఒప్పందానికి ముందునుంచే పర్యావరణ సమతూకం పరిరక్షణకు భారత్ కృషి చేస్తునే వచ్చిందని పేర్కొన్నారు.
చిత్రం: అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో మాట్లాడేందుకు రష్యాఅధ్యక్షుడు పుతిన్‌తో కలసి ఉల్లాసంగా తరలివస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ