బిజినెస్

గడువు.. డిసెంబర్ 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 2: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి రుణ దాతల నుంచి ఏడు నెలల సమయం వచ్చింది. సంస్థ పొందిన రుణాలు 45,000 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వివిధ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఆర్‌కామ్ క్రెడిట్ రేటింగ్‌ను దారుణంగా తగ్గించాయి. ఇది తనను చాలాచాలా బాధించిందంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డిసెంబర్ 31 వరకు రుణ దాతలు (బ్యాంకర్లు) సమయం ఇచ్చారన్నారు.
ఒకవేళ ఈ గడువులోగా రుణాలను చెల్లించనిపక్షంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకునే హక్కు రుణ దాతలకు ఉంటుందని కూడా అనిల్ ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం. అయితే ఆర్‌కామ్ ఆస్తులను విక్రయిస్తున్నామన్న ఆయన సెప్టెంబర్‌లోకల్లా ఎయిర్‌సెల్‌తో విలీనం, టెలికామ్ టవర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన రెండు ఒప్పందాలతో రుణ భారం 20,000 కోట్ల రూపాయలకు తగ్గగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ రుణ భారాన్ని కూడా తగ్గించుకోవడానికి అంతర్జాతీయ వ్యాపారాలను అమ్మటానికి సిద్ధమని ప్రకటించారు. కాగా, ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం అనంతరం ఏర్పడే సంస్థ పేరు ఎయిర్‌కామ్‌గా పిలవబడుతుందన్నారు. ‘మా భవిష్యత్ ప్రణాళికలకు రుణ దాతలు ఆమోదం తెలిపారు. మాకు అప్పులిచ్చిన వారంతా కలిసి ఓ జాయింట్ లెండర్ ఫోరమ్ (జెఎల్‌ఎఫ్)గా ఏర్పడ్డారు. ఎస్‌డిఆర్‌లో భాగంగా ఏడు నెలల గడువు లభించింది.’ అని విలేఖరులకు అనిల్ అంబానీ చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల నివారణార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. తెచ్చిన విధానమే ఈ వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డిఆర్). కాగా, దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరాని (2016-17)గాను 1,285 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)లో 660 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.
అయితే అనిల్ అంబానీ అన్నయ్య ముకేశ్ అంబానీ.. రిలయన్స్ జియోతో దేశీయ టెలికామ్ రంగంలోకి చేసిన ప్రవేశంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌సహా అన్ని టెలికామ్ సంస్థల ఆదాయం తలకిందులైంది. ఉచిత 4జి సేవలతో లాభాలు హరించుకుపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తాజా పరిస్థితికి జియో ప్రధాన కారణమని ఆ సంస్థ సిఎఫ్‌ఒ పునిత్ గార్గ్ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశీయ టెలికామ్ రంగం ఇబ్బందుల్లో ఉందన్న ఆయన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఏడాది 40,000 ఉద్యోగాలు పోయే ప్రమాదముందనీ హెచ్చరించారు.
‘అన్నయ్యతో సత్సంబంధాలే’
మరోవైపు అన్న ముకేశ్‌తో తనకు ఏమాత్రం సత్సంబంధాలు లేవన్న వార్తలను అనిల్ ఖండించారు. వాటిలో వాస్తవం లేదన్నారు. మున్ముందు కూడా తమ మధ్య సోదర భావానికి వచ్చిన ముప్పేమి ఉండబోదన్న ఆయన అన్నపట్ల గౌరవం తగ్గబోదన్నారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు ముకేశ్, అనిల్ అంబానీలు పంచుకున్నది తెలిసిందే.