భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలవోజు పరమేశ్వరాచారి, పరకాల (వరంగల్)
ప్ర:శర్మగారూ! గత వారం ఎవరో దేశాన్ని గురించి ప్రశ్నిస్తే చెప్పిన సమాధానం బాగుంది. మతమెప్పుడూ మానవుని సంస్కరించాలి కాని క్రూరత్వం వైపు ఎందుకు లాక్కెళుతుంది-?
సమా:మనుషుల్లో సత్వ - రజః - తమో గుణాల వాళ్ళుంటారు. తమోగుణం గలవారికి మతం కూడా మత్తునే కలిగిస్తుంది కాని జ్ఞానాన్ని కలిగించదు. వారి ఉపాసనలు కూడా అలాగే ఉంటాయని భగవద్గీత చెపుతుంది. మత సిద్ధాంతం ఒక వెలుగు రేఖ- మనిషి స్వభావం రంగుల బల్బ్ వంటిది- కాంతి సహజంగా స్వచ్ఛమైనా రంగుల బల్బ్ కారణంగా రంగు మారుతుంది కదా! అందుకే మనిషి- మనుషుల స్వభావం ముఖ్యం- మతం కాదు.
సంపత్‌కుమార్, నెల్లూరు
ప్ర:ప్రమోషన్స్ ఎప్పుడు- బదిలీ ఏ దిశగా ఉంటుంది-?
సమా:ఆగస్ట్ - అక్టోబర్‌లో పూర్తి అవకాశాలున్నాయి. మీరున్న దిశ నుండి ఉత్తర వాయువ్యాలు- జె, బి, ఎస్ అక్షరాలు- మీకు విద్యాయోగం బాగుంది. విద్యాభివృద్ధికి ప్రయత్నించండి.
రెడ్డిచర్ల లీలావతి, బద్వేలు, కడప
ప్ర:అక్కగారికి అనారోగ్యం- పక్షవాత లక్షణాలు- భవిష్యత్తు ఏమిటి?
సమా:కొంతకాలం తరువాత నయమయ్యే అవకాశం ఉంది. ఎవరో వ్యక్తి కారణంగానో ధనమూలకంగానో మోసపోయి మనస్సుమీద ప్రభావం పడ్డట్టు కనిపిస్తున్నది- మెరుగైన చికిత్స- మానసిక ప్రశాంతి అత్యవసరం.
ఎస్.బాబూరావ్, కావలి (నెల్లూరు)
ప్ర:ఏ ప్రయత్నమూ ఫలించుటలేదు. ఏమిచేయాలి?
సమా:మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏ ప్రయత్నమూ అంటే అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. ఒక ప్రయత్నమే పట్టుదలతో ప్రయత్నించండి, ఫలిస్తుంది. ‘‘వెదకుము దొరకును’’, ‘‘తట్టుము - తెరవబడును’’ అన్న పవిత్ర బైటిల్ సూక్తులు గుర్తుపెట్టుకోండి.
ఎమ్.రమేశ్, సంజీవపురం, సికింద్రాబాద్
ప్ర:శని పీడ నివారణకు ఏం చేయాలి?
సమా:అన్నంలో నల్ల నువ్వులు కలిపి ప్రతి శనివారం కాకులకు పెట్టండి.
జె.వి.అరుణ, రవీంద్రనగర్, కడప
ప్ర:స్వంత ఇంటి యోగం ఉందా?
సమా:మీలో కోరిక ఉంది కాని ఆ సంబంధంగా ప్రయత్నమేమీ చేస్తూ ఉన్నట్టు లేదు. గట్టిగా ప్రయత్నించండి. ఉత్తర దిశలో లభించే అవకాశం ఉంది.
గుండా మాధవ్, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్ర:నాది శ్రవణా నక్షత్రం- బట్టల షాపు నడిపిస్తున్నాను. అందులోనే ఉండమంటారా?
సమా:అందులోనే స్ర్తిలకు సంబంధించిన వస్త్రాలు ఎక్కువగా పెట్టండి. షాపు కూడా స్ర్తిల పేరనే ఉంటే మరీ మంచిది.
మార్తి వెంకటరమణ - మఠంపల్లి (తెలంగాణ)
ప్ర:ఆర్థిక బాధలు- అనారోగ్యం- సంతాన లేమి- మానసిక అశాంతి బాధిస్తున్నాయ. పరిష్కారం చెప్పండి!
సమా:ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వర వ్రతం చేయండి. లేదా ప్రతి పౌర్ణిమకూ శ్రీ సత్యనారాయణ వ్రతం చేయండి.
గాలి మదన్‌రావు, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర:కాంట్రాక్టు కేసు- 2007 నుండి కోర్టులో పెండింగ్ ఉంది పరిష్కారం ఎప్పుడు-
సమా:ఇంకా చాలా ఆలస్యముంది. వచ్చే సంవత్సరం 2018 చివరి భాగంలో కొంత నష్టంతో పరిష్కారమవుతుంది.
పద్మనాభం డి.వి.పి, తెనాలి, గుంటూరు
ప్ర:సంఖ్యాశాస్తవ్రేత్తగా సెటిల్ కావాలని ఉంది. అవసరమైన సూచనలివ్వండి.
సమా:ప్రాథమికంగా జ్యోతిష పరిజ్ఞానం లేకుండా సంఖ్యా శాస్త్రం నేర్వలేరు. మొదటగా కొంత జ్యోతిషశాస్త్ర పరిజ్ఞానం సంపాదించండి.
ఐ.సరస్వతి, పుట్టపర్తి, అనంతపురం
ప్ర:వివాహం యోగం ఎప్పుడు?
సమా:నవంబర్ వరకు శుభసూచనలు రాగలవు.
పేరిచర్ల రాజంరాజు, తాడేపల్లిగూడెం (ఆంధ్ర)
ప్ర:పెద్దబ్బాయి ఇల్లు విడిచి వెళ్ళాడు నాలుగేళ్ళ క్రితం- ఏమయ్యుంటాడు
సమా:ఉత్తర దిశలో తీర్థ క్షేత్రాలలో ఉండాలి.
ఎమ్.దేవి, రుస్తుంబాద (ప.గో)
ప్ర:అమావాస్యనాడు జన్మించాను. జీవితం దుర్భరంగా ఉంది. పరిష్కార శాంతి ఏమిటి?
సమా:అమావాస్యనాడు ఆడపిల్ల జన్మించటం శుభమే- ఎవరో మీకు అపోహలు కల్పించారు. జీవితంలోని సమస్యలకు కారణం- జన్మ నక్షత్రం- జన్మలగ్నం- నవాంశ లగ్నం- గ్రహసంపత్తి కారణం- అది కాదు- సమర్థులైన పండితులతో జాతకం చూపించుకోండి. పరిష్కారం దొరుకుతుంది.
బి.్భస్కరరావు, కామవరపుకోట (ఆం.ప్ర)
ప్ర:్భమి- కోర్టు తగాదా? రాజీయా? తీర్పా? ఎవరికి అనుకూలం?
సమా:పద్ధతి ఏదైనా మీకే అనుకూలంగా కనబడుతోంది. భూలాభం జరగవచ్చు. ధననష్టం మాత్రం జరుగుతుంది.
సి.సునీల్‌కుమార్, చెన్నై, తమిళనాడు
ప్ర:వివాహం ఎప్పుడు జరుగవచ్చు ?
సమా:ఆగస్టులో శుభసూచన
పీసపాటి కృష్ణప్రియ, బుజబుజ నెల్లూరు, నెల్లూరు
ప్ర:ఇల్లు అమ్మకం ఫలిస్తుందా?
సమా:ఆలస్యం- ఇతరుల అభ్యంతరాలు- కావలసినవారికి అంటే దగ్గరి బంధువులకు దాని పట్ల ఆశ కనబడుతోంది. బహుశా వారే కొంటారేమో?
బి.ఎస్.జ్యోతి, ఎనమకుదురు (కృష్ణా)
ప్ర:వివాహం - ఉద్యోగం?
సమా:వివాహయోగం అక్టోబర్- నవంబర్‌లలో కలుగగలదు. ఉద్యోగం ఆలస్యం-
ఎమ్.ఆర్.ఎన్.ప్రసాద్, చాగలమర్రి, కర్నూలు
ప్ర:కొడుకు- కోడలు- మనుమరాళ్ళవలన సతాయింపు- టార్చర్- మాకు పరిష్కారమేమిటి?
సమా:మీ సమస్య విషయంలో కొన్ని ధన ప్రధానమైన విషయాలు కనబడుతున్నాయి. బహుశా, మీ వద్ద ఏవైనా డబ్బు ఉన్నదేమో ఆలోచించుకోండి.
ఎమ్.శివగామి, నరసాపురం (ప.గో.)
ప్ర:ఆరోగ్య సమస్య- ప్రతిరోజూ లలితా సహస్రనామాలు- విష్ణు సహస్రనామాలు చేస్తాను. అయినా ఆరోగ్యం కుదుటపడటంలేదు. ఏమిచేయాలి
సమా:లలితా సహస్రనామామలు- విష్ణు సహస్రనామాలు- యోగ విద్యలు- సరియైన ఉపదేశ విధానాలు లేకుండా చేస్తే హాని కలుగుతుంది. సులభంగా ప్రతిరోజూ సూర్యోదయాత్పూర్యం స్నానం చేసి తులసీవ్రతం చేయండి. తులసి తీర్థం తీసుకోండి. శుభం జరుగుతుంది.
ఆర్.మధుసూదన్‌రావు, మదనపల్లి, చిత్తూరు
ప్ర:నాకు చెవులు సరిగా వినిపించటంలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
సమా:జాతకంలో శని దోషం ఉంటే ‘బధిర యోగం’ కలుగుతుంది. నువ్వులు - ఉలవలు - దానం చేయండి. హోమియోలో ‘కాస్టికం-6ఎక్స్’ చెవి దోషాలకు మంచి మందు. డాక్టర్ సలహాతో వాడండి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ