ఆటాపోటీ

పాప్‌కార్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పొటాటో’ ఇంజీ!
యాభై సంవత్సరాల స్వాతంత్య్రానికి గుర్తుగా 1996 సెప్టెంబర్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు టోరంటో (కెనడా)లో ఐదు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో తలపడ్డాయి. సెప్టెంబర్ 16న జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో ఓ గుడ్ లెంగ్త్ బంతిని ఇంజమామ్ చాలా నిర్లిప్తంగా షాట్ కొట్టాడు. అది నేరుగా అనిల్ కుంబ్లే చేతిలో పడడంతో ఐదు పరుగులకే అతను అవుటయ్యాడు. పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో ప్రేక్షకుడు తనను ‘పొటాటో’ (ఆలుగడ్డ) అని వెక్కిరించాడన్న కోపంతో అతనిపై దాడికి దిగాడు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని, ఇంజీని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. మైదానంలో చాలా నింపాదిగా కదులుతాడని, అందుకే ఎక్కువ సార్లు రనౌట్ అవుతాడని ఇంజీకి పేరు. అందుకే, ఎవరు పెట్టారోగానీ అతనికి ‘పొటాటో’ పేరు స్థిరపడింది.

అఫ్రిదీ రికార్డు
భారత్‌పై మూడు ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ రికార్డు సృష్టించాడు. అయితే, భారత్‌పై అతనికి పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఎందుకంటే, ఆ మూడు వరల్డ్ కప్ టోర్నీల్లో కలిపి అతను భారత్‌పై కేవలం 34 పరుగులు చేశాడు. ఒక వికెట్ మాత్రమే తీశాడు.

గంగూలీ బౌలింగ్
సౌరవ్ గంగూలీని ఎవరికైనా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గానే తెలుసు. అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్‌గా అవతారం ఎత్తుతాడని కొంత మందికి తెలుసు. కానీ, పాకిస్తాన్‌తో జరిగిన ఒక వనే్డలో అతను తన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. 1997లో టోరంటో వేదికగా జరిగిన మ్యాచ్‌లో గంగూలీ బౌలర్‌గా సంచలనం సృష్టించాడు. అత్యంత సంక్లిష్టమైన స్థితిలో బౌలింగ్‌కు దిగి, 10 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ప్రతిభతోనే భారత్ ఆ మ్యాచ్‌ని 38 పరుగుల తేడాతో గెల్చుకుంది. పాక్‌పై ఒక భారత్ బౌలర్‌కు అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణగా అతను నెలకొల్పిన రికార్డు ఇప్పటికే పదిలంగానే ఉంది.

శివసేన ఆగ్రహం
దేశంలో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను శివసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. 1991లో భారత్ పర్యటనకు పాక్ జట్టు వస్తున్నదన్న సమాచారంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు ముంబయి వాంఖడే స్టేడియంలోకి చొరబడ్డారు. పిచ్‌ని తవ్వేశారు. అంతేగాక, పాక్‌ను అడుగుపెట్టనీయమంటూ ఆందోళన చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆ టూర్‌ను రద్దు చేసుకుంది.

-సత్య