జాతీయ వార్తలు

హురియత్ నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: కాశ్మీర్ లోయలో అల్లర్లకు పాకిస్తాన్‌నుంచి నిధులు లభిస్తున్నాయన్న సమాచారం అందడంతో ఈ హవాలా కార్యకలాపాలకు చెక్ పెట్టే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శనివారం జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) వేర్పాటువాదులు, హురియత్ నేతలే లక్ష్యంగా న్యూఢిల్లీ, హర్యానా, కాశ్మీర్‌లో ఏకకాలంలో దాడులు జరిపింది. మరోవైపు వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ షాపై గతంలో నమోదయిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణాధికారి ఎదుట హాజరుకావాలని ఇడి ఆ సమన్లలో పేర్కొంది.
2005 ఆగస్టులో నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఇడి గతంలో అనేకసార్లు షబ్బీర్ షాకు సమన్లు జారీ చేసిం ది. ఆయన ఎప్పుడు కూడా సమన్లలో పేర్కొన్న తేదీనాడు ఇడి ముందు హాజరు కాలేదు. 2005 ఆగస్టులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహమ్మద్ అస్లామ్ వనీ అనే హవాలా డీలర్‌ను అరెస్టు చేసింది. పోలీసుల విచారణలో అతను తాను షాకు 2.25 కోట్ల రూపాయలు అందజేసినట్లు చెప్పా డు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేసినట్లు అలీ గతంలోనే ఆరోపించారు. ఇదిలా ఉండగా కాశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఢిల్లీ, హర్య్యానాలోని హవాలా డీలర్లు లక్ష్యంగా చేసుకొని ఎన్‌ఐఏ శనివారం దాడులు జరిపింది. వేర్పాటువాద నాయకుడు నరుూమ్ ఖాన్ పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబానుంచి నిధులు అందుకున్నట్లు ఓ స్టింగ్ ఆపరేషన్‌లో అంగీకరించాడు. ఆ స్టింగ్ ఆపరేషన్ వివరాలు ఓ న్యూస్ చానల్ లో ప్రసారం కావడంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. కాగా, కాశ్మీర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని కటకటాల వెనక్కి నెట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఈ దాడులతో స్పష్టమవుతోందని, జమ్మూ, కాశ్మీర్‌లోని ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
కాశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని కూడా ఆయన అన్నా రు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శాంతి పునరుద్ధరింపబడ్డంతో పాటుగా ఉగ్రవాదాన్ని, అల్లర్లను ప్రోత్సహించే వారిని శిక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకొంటుందని ఆయన చెప్పారు.