అంతర్జాతీయం

ఆర్థిక సుస్థిరత, శాంతి ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గపూర్, జూన్ 3: ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని అమెరికా ప్రశంసించింది. దక్షిణ చైనా సముద్ర జలాల వివాదంపై ఆయన కచ్చితమైన వైఖరిని ప్రదర్శించారని, ఒక మార్గనిర్దేశన చేశారని కితాబు ఇచ్చింది. షంగ్రీ-లా డైలాగ్ వార్షిక సమ్మిట్‌లో అమెరికా రక్షణ శాఖ మాజీ సెక్రెటరీ జనరల్ జేమ్స్ మట్టీస్ దక్షిణ చైనా సముద్ర వివాదంలో రెండు పెద్దదేశాలైన అమెరికా, చైనా పట్టింపులకు పోవడాన్ని ప్రస్తావించారు. పరస్పరం పోటీపడడం అనివార్యం కాదన్నారు. నావిగేషన్‌కు సం బంధించిన స్వేచ్ఛను అందరూ గౌరవించాల్సిందే. అంతర్జాతీయ నియమావళి కింద ఆర్థిక సుస్థిరత, శాంతికోసం పనిచేయాలి’ అని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీ దక్షిణ చైనా సముద్ర వివాదంపై వ్యూహాత్మక వైఖరి తీసుకున్నారని మట్టీస్ ప్రశంసలు కురిపించారు. అం తర్జాతీయ న్యాయ సూత్రాలను మోదీ ఎంతగా నో గౌరవిస్తున్నారని, వాటికి అనుగుణంగానే భారత్ నడుస్తోందని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన 11వ తూర్పు ఆసి యా సమ్మిట్‌లో మోదీ ప్రసంగాన్ని ఈ సందర్భంగా జేమ్స్ గుర్తుచేశారు. శాంతి, సుస్థిరత కోసం వివాదాలు పరిష్కరించుకుకోవాలని ఆయన చెప్పారని యుఎస్ అధికారి పేర్కొన్నారు. దక్షిణ చైనా సుముద్రంపై తమదే సర్వధికారమని చైనా వాదిస్తోంది. దీనికి తగ్గటే అనేక సముద్ర దీవుల్లో సైనిక బలగాలు మోహరించింది. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో విపరీతమైన సం పద ఉంది. అపారమైన ఖనిజసంపద, చమురు, సహజ వనరులు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజానికి నష్టం కలిగించేలా చైనా ఆలోచనలున్నాయని, తాము వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని మట్టీస్ తెలిపారు.