అంతర్జాతీయం

కాబూల్ పేలుళ్లలో 18 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, జూన్ 3: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మళ్లీ నెత్తురోడింది. నగరంలోపలుచోట్ల జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నగరంలోని ప్రధాన రోడ్లన్లీ మూసేశారు. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి హింసకు దిగారు. వీధి పోరాటల్లో కనీసం నలుగురు మృతి చెందారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో భారీఎత్తున సాయుధ బలగాలు మోహించాయి. అలాగే వీధుల్లో పెట్రోలింగ్ విస్తృతం చేశారు. కాబూల్ నగరంలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. బయట నుంచి ఎవర్నీ అనుమతించడం లేదు. ఆత్మాహుతి దాడులలు నివారించలేని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేయాలని జనం వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. దౌత్య అధికారుల క్వార్టర్స్ వద్ద బుధవారం నాటి పేలుళ్లలో 90 మంది మృతి చెందారు. 2001 తరువాత ఇదే పెద్ద పేలుడు ఘటనగా అధికారులు చెబుతున్నారు. మరోపక్క నగరారికి వచ్చే రహదారులన్నీ మూసివేశారు. ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు కాబూర్ సైనిక కమాండర్ గుల్‌నబీ అహ్మదజై తెలిపారు.
అంత్యక్రియల్లో పేలుళ్లు
కాబూల్ నగరం శనివారం సాయంత్రం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఘర్షణల్లో చనిపోయిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో అనేక మంది గాయపడ్డారు. అసలే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండగా ఈ పేలుళ్లతో భయానక పరిస్థితులు తలెత్తాయి. తన తండ్రి సలీం ఇజ్దాయర్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పేలుళ్లు సంభవించాయని కుమారుడు అబ్దుల్ వుదూద్ వెల్లడించారు. ప్రము ఖ రాజకీయ నాయకుడైన అబ్దుల్ పేలుళ్లలో అనేక మంది మృతి చెందారని చెప్పారు.

కాబూల్‌లో శనివారం రాళ్లురుమ్వతున్న వారిని చెదరగొడుతున్న అఫ్ఘాన్‌సైన్యం