జాతీయ వార్తలు

తోకముడిచిన విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు గుప్పించిన విపక్షాలు, యంత్రాలను ట్యాంపర్ చేసి చూపించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సవాల్‌కు చివరిక్షణంలో ప్రతిపక్షాలు తోకముడిచాయి. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హ్యాకథాన్‌కు కేవలం సిపిఎం, ఎన్సీపీ హాజరైనా, ట్యాంపర్ సవాల్‌కు నిరాకరించి ఓటమిని పరోక్షంగా అంగీకరించాయి. కేంద్ర ఎన్నికల సంఘం హ్యాకథాన్‌కు 8 జాతీయ, 48 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించటం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని పెద్దఎత్తున ఆరోపించిన బిఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు హ్యాకథాన్‌కు గైర్హాజరయ్యాయి. ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, బిఎస్పీ అధినేత్రి మాయావతి ఈవిఎంలు ట్యాంపరయ్యాయంటూ పెద్దఎత్తున దుమారం సృష్టించటం తెలిసిందే. ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న సిఇసి, శనివారం హ్యాకథాన్ నిర్వహించింది. అయితే, హ్యాకథాన్‌కు హాజరైన సిపిఎం, ఎన్సీపీల ప్రతినిధులు తాము సవాల్‌కు రాలేదని, ఈవిఎంల పనితీరు అర్థం చేసుకోవడానికే వచ్చామంటూ మాటమార్చారు. సిపిఎం, ఎన్సీపీ ప్రతినిధుల విజ్ఞప్తిమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది, నిపుణులు రెండు పార్టీల ప్రతినిధులకు ఈవిఎంల పనితీరును లోతుగా వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది ఇచ్చిన ప్రదర్శన తమకు సంతృప్తి కలిగించిందని రెండు పార్టీల ప్రతినిధులు తెలిపారు. తమకు వివరించిన విధంగానే ఇతరులకూ ఈవిఎంల పనితీరు వివరించాలన్న రెండు పార్టీల సూచనను కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరించింది. ఈవిఎంలు పని చేసే విధానాన్ని అందరికీ వివరించేందుకు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం రెండు పార్టీల ప్రతినిధులకు హామీ ఇవ్వటంతో హ్యాకథాన్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఢిల్లీలోని తమ కేంద్ర కార్యాలయంలోని ఏడో అంతస్తులో హ్యాకథాన్ ఏర్పాటు చేశారు. దీనికోసం ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో వినియోగించిన 14 ఈవిఎంలను ప్రదర్శనకు పెట్టారు. హ్యాకథాన్‌కు వచ్చిన సిపిఎం, ఎన్సీపీ ప్రతినిధులకు నాలుగేసి చొప్పున ఈవిఎంలను ఇచ్చారు. అయితే సిపిఎం ప్రతినిధులు హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు నిరాకరించారు. సవాల్ కోసం రాలేదని, యంత్రాల పనితీరు వివరిస్తే చాలని కోరటంతో హ్యాకథాన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఘన విజయం సాధించినట్టయ్యింది.
వివాదం ముగిసినట్లే: జైదీ
ఎన్నికల కమిషన్ ఉపయోగించే ఇవిఎంలను ట్యాపరింగ్ చేయలేరనే విషయం రుజువు అయినందున, అలాగే భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో పేపర్ ట్రయల్ మిషన్లను ఉపయోగించనున్నందున ఇవిఎంల ట్యాంపరింగ్ సమస్య ముగిసినట్లేనని నసీమ్ జైదీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇసి ఉపయోగించే ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నించే ఎలాంటి పరీక్షలను అనుమతించేది లేదని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఇవిఎంల చాలెంజ్‌లకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించే విధంగా విమర్శలు చేసినట్లయితే ఆ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా జైదీ స్పష్టం చేశారు. ‘్భవిష్యత్తులో హైకోర్టు తీర్పును నేరుగా ఉల్లఘించే ఏదయినా అంశం జరిగినట్లయితే ఇసి దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ ఆయన చెప్పారు.