అంతర్జాతీయం

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 3: పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి పారిస్ ఒప్పందానికి మించి తాము కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందంనుంచి వైదొలగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో శనివారం సమావేశమైన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలన్న సంస్కృతిని ఈ ఒప్పందం ప్రపంచానికి గుర్తు చేస్తోందని, ఈ విషయంలో పారిస్ ఒప్పందానికి మించి భారత్ కృషి చేస్తుందని అన్నారు. 2015లో ఫ్రెంచ్ రాజధానిలో 195 దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందం భావి తరాలకు రక్షణ కల్పించి వారికి కొత్త ఆశలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కాగా, వాణిజ్యం, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం లాంటి అనేక అంశాలపై రెండు గంటలకు పైగా చర్చించిన తాము ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు తమ కృతనిశ్చయంపైనే చర్చించామని మేక్రాన్ అన్నారు. ‘్భతాపానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్రాన్స్ పూర్తిస్థాయి కృతనిశ్చయాన్ని నేను పునరుద్ఘాటించదలిచాను’ అని ఆయన అన్నారు. సౌరశక్తిపై జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం కోసం తాను ఈ ఏడాది చివర్లో భారత్ సందర్శించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అధ్యక్ష భవనం ఎల్సీ ప్యాలెస్‌లో మేక్రాన్‌తో చర్చలకోసం వచ్చిన మోదీ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయినందుకు అభినందనలు తెలియజేశారు. 39 ఏళ్ల మేక్రాన్ ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశమైనారని, అత్మీయత, స్నేహానికి గుర్తుగా ఈ సమావేశం జరిగిందని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇరువురు నేతల సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం ఆయన ట్విట్టర్‌లో ఉంచారు.

ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్
మేక్రాన్‌తో ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం