అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 4: బ్రిటన్‌లో వచ్చే గురువారం జరగాల్సిన సార్వఅతిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రధాని తెరిసా మే ప్రకటించారు. లండన్‌లో శనివారం ఉగ్రవాద దాడి అనంతరం భద్రతా దళాల ఉన్నతాధికారులతో అత్యవసర ‘కోబ్రా’ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం మే విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియను హింస భగ్నం చేయడానికి ఎప్పటికీ అనుమతించకూడదు’ అని అన్నారు. పాశ్చాత్య విధానాలు ఇస్లాంకు సరిపోవనే దుష్ట ఆలోచనతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న ఆమె అంటూ,ఇకపై ఇలాంటి దాడులు జరగడానికి వీల్లేదని, అందరూ కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒకరినొకరు అనుకరిస్తూ, క్రూరమైన విధానాలను ఉపయోగిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. దాడులకు పాల్పడిన దుండగులు నకిలీ బాంబులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. గత మార్చిలో లండన్ పార్లమెంటుపై దాడి తర్వాత బ్రిటీష్ భద్రతా, ఇంటెలిజన్స్ సర్వీసులు అయిదు ఉగ్రదాడుల కుట్రలను భగ్నం చేశారని థెరిసా మే చెప్పారు. కాగా, దాడికి పాల్పడిన దుండగులను ముఖాముఖి ఎదుర్కోవడం ద్వారా పోలీసు అధికారులు అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించారని మెట్రోపాలిటన్ పోలీసు కమిషనర్ క్రెస్సిడా డిక్ అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఈ దాడులపై మితిమీరి స్పందించడం కాని, ఇతర మతాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడ్డం కానీ చేయకుండా ఉండాలని ఆమె కోరారు. కాగా, లండన్‌లో జరిగిన ఉగ్రదాడులను తీవ్రం గా ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విపత్కర పరిస్థితిలో బ్రిటన్‌కు ఎలాంటి సాయాన్నైనా అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. ముస్లిం దేశాలకు చెందిన వారిపై నిషేధం విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని ఈ దాడులు మరోసారి రుజువు చేశాయని కూడా ఆయన అన్నారు.