బిజినెస్

యథాతథ స్థితికే ఆర్‌బిఐ మొగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: రిజర్వ్ బ్యాంక్ బుధవారం జరిపే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వచ్చే నెల 1నుంచి అమలయ్యే వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏ విధంగా ఉండనుందో పరిశీలించాల్సి ఉన్నందున ఆర్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి వెళ్లకపోవచ్చని వారంటున్నారు. అయితే జిడిపి వృద్ధి అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఉండిన 8 శాతంనుంచి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1శాతానికి పడిపోయిన దృష్ట్యా జిడిపి వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలతో పాటుగా ప్రభుత్వం ఆర్‌బిఐపై ఒత్తిడి తెస్తున్నాయి.
‘ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడంతో పాటుగా మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితి కూడా బాగానే ఉన్నందున ఈ సారి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించక పోవచ్చు’ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఎండి, చీఫ్ ఫైనాన్షియల్ అధికారి అన్షులా కాంత్ అభిప్రాయ పడ్డారు. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య సమీక్ష కమిటీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానం సమీక్ష కోసం ఈ నెల 6, 7 తేదీల్లో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాబోయే ద్రవ్య సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటును తగ్గిస్తుందని తాను అనుకోవడం లేదని ఏదయినా నిర్ణయం తీసుకునే ముందు వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల కోసం అది ఎదురు చూడవచ్చు అని యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కతురియా అభిప్రాయ పడ్డారు. పప్పు్ధన్యాలు, కూరగాయలతో పాటుగా హార వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగదారుల ధరల ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 2.99 శాతానికి పడిపోయింది. 2016 ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.47 శాతంగా ఉండింది. అదే సమయంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సైతం ఏప్రిల్ నెలలో నాలుగు నెలల కనిష్టస్థాయి అయిన 3.85 శాతానికి తగ్గింది.కాగా, జూలై 1నుంచి అమలులోకి రానున్న జిఎస్‌టి ప్రభావం ద్రవ్యోల్బణంపై పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఆర్‌బిఐ ఆచితూచి వ్యవహరించవచ్చని జపాన్‌కు చెందిన అంతర్జాతీయ సేవల దిగ్గజం నోమురా సైతం అభిప్రాయ పడింది. తాత్కాలిక అంశాల కారణంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించడానికి బదులు పెంచే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని నోమురా అభిప్రాయ పడింది. వచ్చే ఏడాది మార్చిదాకా ఆర్‌బిఐ యథాతథ స్థితినే కొనసాగించవచ్చని, ఆ తర్వాత అరశాతం చొప్పున వడ్డీ రేటును పెంచే అవకాశాలు లేకపోలేదని ఆ సంస్థ ఒక నివేదికలో అభిప్రాయ పడింది.