క్రీడాభూమి

మూడోసారి సెంచరీ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్జిబాస్టన్: చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ జోడీ మూడో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇది మూడోసారి. ఈ టోర్నీలో ఎక్కువ సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్ వీరివే. క్రిస్ గేల్, శివనారైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్), హెర్చెల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) రెండేసి పర్యాయాలు సెంచరీ భాగస్వామ్యాలను సాధించారు.
* పాకిస్తాన్‌పై రోహిత్ శర్మకు వనే్డల్లో ఇదే అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 68 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌లో 91 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. మొత్తం మీద అతను పాక్‌తో 12 వనే్డ మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ శతకాలను సాధించాడు.
* భారత టాప్ ఆర్డర్‌లో నలుగురు అర్ధ శతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు, 2006లో ఇండోర్, 2007లో హెడింగ్లేలో ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డల్లో టీమిండియా టాప్ ఆర్డర్‌లో ముగ్గురేసి బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలను నమోదు చేశారు.
* భారత్‌తో ఆడిన గత పది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ టాస్ నెగ్గడం ఇది మూడోసారి. ఏడు పర్యాయాలు టాస్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి, ఫీల్డింగ్ ఎంచుకుంది.