రాష్ట్రీయం

ఢిల్లీని ఎందుకు నిలదీయరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు విశ్రమించేదిలేదని కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. ఆదివారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభకు సిపిఐ, జనతాదళ్ (యు), సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకె, ఐయుఆర్‌ఎంఎల్, తదితర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హాజరై సంఘీభావం తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్, ఎన్‌సిపి, నేషనల్ కాన్ఫరెన్స్, జనసేన పార్టీలు మద్దతిస్తూ సందేశాలు పంపాయి. ఇది ఎన్నికల సభ కాదని, ఏపికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించే వేదికగా నేతలు అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సెంటర్ ఫర్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజీ ఎవరూ కాదనరని చెప్తూ హోదా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా అన్నావు.. ఏపిని ఎప్పుడు అభివృద్ధి చేస్తావో చెప్పాల’ని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాల ఫలితంగానే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించారు. టిడిపి ఎన్నికల గుర్తు, తమ పార్టీ గుర్తు సైకిల్ అని, కేంద్రంలో సైకిల్ చక్రం తిప్పగలిగేది రాహుల్ గాంధీయే అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా సాధించుకోవటంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంబించటం అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాష్టప్రతి అభ్యర్థికి ఓటేయాలంటే తమకు హోదా ఇవ్వాలని ఢిల్లీని ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో మోదీ, బాబు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, మహిళల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మోదీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు సభతో మోదీ, బాబు వెన్నుల్లో వణుకు పుడుతోందని, ఇప్పటికైనా బిజెపి, టిడిపి కుతంత్రాలు మాని ప్రత్యేక హోదా దిశగా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హోదా సాధనలో ఏపికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
రాష్టప్రతి అభ్యర్థికి ఓటేయొద్దు
గత సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని, ఎన్నికల హామీలో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని జనతాదళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ విమర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటిస్తే పదేళ్లు ఇస్తామని మోదీ హామీ ఇచ్చి ఇప్పుడు దాటవేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలకోరు ప్రధాని కావటం దేశ ప్రజల దురదృష్టమన్నారు. 1947 నాటి వేర్పాటువాదం తరహాలో మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను మోదీ దగ్గరకు తీస్తున్నారని, అందువల్లే ప్రత్యేక హోదా సాధించలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థికి మద్దతివ్వరాదని ఆయన స్పష్టం చేశారు.
హోదా తెరిచిన అధ్యాయమే
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన బిజెపి, టిడిపి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కొట్టిపారేస్తే సరిపోదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. హోదా సాధించేంతవరకు అది తెరిచిన అధ్యాయమేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా సభకు వచ్చేవారిని ద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించటం సిగ్గుచేటన్నారు. బాబు మానసిక స్థితి ఇంతకు దిగజారుతుందని తాను ఊహించలేదన్నారు. ప్రత్యేక హోదా కాంక్షించే ప్రతిఒక్కరికీ మద్దతివ్వాలన్నా రు. గుంటూరు సభ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు.. చంద్రబాబును తొలగించేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అధికార పక్షం ఎందుకు సాగిలపడుతోందో తేల్చాలన్నారు. ప్రత్యేక హోదా సభకు నల్లజెండాలతో నిరసన తెలియజేయటం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టటమే అవుతుందన్నారు. మతోన్మాద బిజెపితో అవకాశవాద పొత్తులు పెట్టుకున్న టిడిపి ప్యాకేజీని సమర్ధించుకోవటం దుర్మార్గమన్నారు. ఇది భావోద్వేగాల సమస్యకాదని, కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు.
పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలతో వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారని, హోదా సాధిస్తే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నాడు ప్రకటన చేస్తే చట్టం చేయలేమని ఇప్పుడు బుకాయించటం సరికాదన్నారు. సంఘ్ పరివార్ చేతిలో మోదీ కీలుబొమ్మ అని విమర్శించారు. అధికార దాహంతో వెంకయ్య నాయుడు, చంద్రబాబు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేశారని, హోదా సాధించేంత వరకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సురవరం ప్రకటించారు.
మోడీ హఠావ్.. దేశ్‌కో బచావ్
దేశ ప్రజలను వంచిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపి భారత్‌ను పరిరక్షించాలని ఆర్‌జెడి నేత జయప్రకాష్ యాదవ్ పిలుపునిచ్చారు. బిజెపి, టిడిపిల మోసంతో ఏపికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూస్థాన్‌ను కబర్‌స్థాన్‌గా మోదీ మార్చుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆయన తెలిపారు.
పార్లమెంట్‌పై గౌరవంలేని ఎన్డీఏ
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలకు పార్లమెంట్ అంటే గౌరవం లేదని డిఎంకె ఎంపి ఇలం గోవన్ విమర్శించారు. 1957లో హిందీ, ఆంగ్ల భాషలపై నాటి డిఎంకె ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే అప్పటి ప్రధాని నెహ్రూ ఇంగ్లీషును రెండో భాషగా ప్రకటించారని, అయితే అది చట్టం చేయాలని పట్టుపడితే ప్రధాని మాట్లాడిందే చట్టమని తేల్చిచెప్పారని గుర్తుచేశారు. అలాంటిది ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాడు ప్రత్యేక హోదాకు హామీ ఇస్తే ఇక చట్టపరమైన అడ్డంకులు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నిర్లిప్త వైఖరి వల్లే హోదాను దాట వేస్తున్నారని, కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం ద్వారా హోదా సాధించాలన్నారు.