రాష్ట్రీయం

జోష్ నింపని రాహుల్ సభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం జాతీయ పార్టీలను పిలిచి గుంటూరు ఆంధ్రా ముస్లిం కాలేజీలో నిర్వహించిన ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ జనం లేక వెలవెల పోయింది. అటు నైరాశ్యంలో ఉన్న పార్టీ కార్యకర్తలకూ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోయింది. కాంగ్రెస్ జాతీయ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాలు ఆశించిన స్థాయిలో స్ఫూర్తినివ్వకపోగా, మరో అతిథిగా వచ్చిన యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రసంగాలకే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
పదివేల మంది పట్టే చిన్న గ్రౌండ్‌ను కూడా నింపలేని అశక్తత కాంగ్రెస్ నాయకుల్లో స్పష్టంగా కనిపించింది. రాహుల్ మాట్లాడుతున్న సమయం వరకూ వేదికకు కుడివైపున ఉన్న కుర్చీలన్నీ ఖాళీగా కనిపించగా, చివర కూడా జనం లేక సభ వెలవెల పోయింది. ఫలితంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ ఒక జిల్లా స్థాయి కంటే దారుణంగా ముగియడంపై శ్రేణుల్లో నైరాశ్యం కనిపించింది. నిజానికి గుంటూరులో జరిగే హోదా సభ ఇటీవల తెలంగాణలో విజయవంతం అయిన సభ స్థాయిలో ఉంటుందని అంతా ఆశించారు. అంతా తెలంగాణ సభతో అంచనా వేశారు. లక్షమంది హాజరవుతారన్న ప్రచారం, హడావిడి కూడా ఆ స్థాయిలో జరగడంతో జాతీయ, స్థానిక చానెళ్లు గుంటూరు సభపైనే దృష్టి సారించాయి. కానీ, చివరకు అది జిల్లా స్థాయి సభగా కనిపించడంతో అంతా నిరాశ చెందారు. అధికారంలో ఉండగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో పదవులు అనుభవించిన వారెవరూ జన సమీకరణ చేయలేదన్న విషయం ఖాళీ కుర్చీలను బట్టి స్పష్టమయింది. స్థానికంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలీ తనకున్న పలుకుబడిని వినియోగించటంతో ఆ కాస్త పరువయినా దక్కిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపించాయి.
పేరుకు రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన సభ అని ప్రచారం చేసినప్పటికీ, గుంటూరు నగరం నుంచే ఎక్కువగా, జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి తరలించినట్లు కనిపించింది. యాదవులలో ఇమేజ్ ఉన్న యుపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రావటంతో, జిల్లాలోని అఖిల భారత యాదవ మహాసభకు చెందిన యాదవ సామాజిక వర్గం ఎక్కవగా తరలివచ్చింది. సభలో అఖిలేష్ పేరు ప్రస్తావించినప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో హర్షధ్వానాలు వినిపించాయి. యాదవ సభ కార్యకర్తలు తమ జెండాలతో కనిపించారు. అఖిలేష్ ప్రసంగం ముగిసిన వెంటనే యాదవ సంఘం కార్యకర్తలు వెళ్లిపోవడం కనిపించింది. గుంటూరు నగరంలో డజన్ల సంఖ్యలో అఖిలేష్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపించడం బట్టి, రాహుల్ కంటే అఖిలేష్‌కే స్పందన ఉన్నట్లు స్పష్టమయింది. రాహుల్ ప్రసంగానికి కార్యకర్తల నుంచి చప్పట్లు ఏ సందర్భంలోనూ కనిపించలేదు. ఆయన వేదికపై ఎక్కి అభివాదం చేసినప్పుడే కార్యకర్తలు హర్షధ్వాలు చేస్తూ చేతులు పైకెత్తారు.
రాహుల్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా లేదన్న నిరాశ కార్యకర్తల్లో వ్యక్తమయింది. అయితే, హోదా విషయంలో మొదటి నుంచీ తెలుగుదేశం-బిజెపిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, ఈసారి జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీని కూడా లక్ష్యంగా ఎంచుకోవడం విశేషం. ప్యాకేజీ కంటే హోదా వల్లే ఎక్కువ లాభం జరుగుతుంటే జగన్ ఎందుకు కేంద్రంపై పోరాడటం లేదని, మోదీతో ఆయనకున్న మొహమాటాలేమిటని రాహుల్‌గాంధీ నేరుగా నిలదీశారు. బాబుతోపాటు ఆయనకు దక్కిన ప్యాకేజీ ఏమిటో జనాలు అర్థం చేసుకుంటున్నారని పరోక్షంగా జగన్-మోదీ కుమ్మక్కయారని ఆరోపణలు గుప్పించడం ద్వారా, హోదాపై పోరాటానికి జగన్ వెనుకంజవేస్తున్నారన్న ప్రచారానికి తెరలేపారు. అటు ఏఐసిసి కార్యదర్శి సాకె శైలజానాధ్ కూడా హోదాపై జగన్‌రెడ్డి ఎందుకు పోరాడటం లేదని, హోదా ఇస్తేనే రాష్టప్రతి ఎన్నికల్లో మద్దతునిస్తానని ఎందుకు షరతు విధించలేదని నిలదీశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తాజాగా వైసీపీ కూడా తన ప్రత్యర్థేనన్నది స్పష్టం చేసింది.