రాష్ట్రీయం

పాలనమీద శ్రద్ధ పార్టీపై ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 5: టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే వెళ్తున్నారన్న అసంతృప్తి శ్రేణుల్లో పెరుగుతోంది. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికే ప్రాధాన్యం ఇచ్చి, పార్టీని పట్టించుకోని కారణంగా ఎదురైన చేదు ఫలితాలను వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో పాలనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న బాబు, కీలకమైన పార్టీ వ్యవస్థాగత అంశాలపై దృష్టి సారించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహానాడు ముగిసే ముందునాటికే పార్టీకి ప్రతిష్ఠాత్మకమైన సంస్థాగత ఎన్నికలు పూర్తవగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించక పోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. విభేదాలున్న జిల్లాలతోపాటు, ఏకాభిప్రాయం ఉన్న జిల్లాల అధ్యక్షుల ప్రకటననూ వాయిదా వేయడాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. చిత్తూరు, కర్నూలు, కృష్ణా, ప్రకాశం, విశాఖ రూరల్‌వంటి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉందన్న కారణంతో అక్కడ ప్రకటనను వాయిదా వేసిన నాయకత్వం, పోటీలేని జిల్లా అధ్యక్షుల ప్రకటననూ వాయిదా వేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. మహానాడు, తర్వాత నవ నిర్మాణదీక్ష, మళ్లీ దానిపై సమీక్షలతోపాటు, రోజూ ప్రభుత్వ శాఖలపై నాలుగైదు సమీక్షలు నిర్వహిస్తోన్న బాబు.. సంస్థాగత సమస్యలు, అంశాలపై మాత్రం ఎక్కువ సమయం కేటాయించటం లేదంటున్నారు. రాష్ట్రంలో మిగిలిపోయిన మార్కెట్ యార్డులు, దేవాలయ పాలక మండళ్ల ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు.
దాంతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా వాయిదా పడుతోందని గుర్తు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీసీలే అధ్యక్షులుగా ఉన్నందున, ఏపీలో దళితుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదని చెబుతున్నారు. అదేవిధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తితిదే పాలకవర్గం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, శాప్, 20 సూత్రాల అమలు కార్పొరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి మరికొన్ని నామినేటెడ్ పదవులు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీకి పనిచేసిన న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవులు ఆశిస్తున్నారని, ఆ జాబితా కూడా పెండింగ్‌లోనే ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా ఢిల్లీలో అధికార ప్రతినిధి లేకపోవడం వల్ల కేంద్రంలో ప్రభుత్వపరంగా, రాజకీయపరంగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడంలో విఫలం అవుతున్నామంటున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ప్రధానిని కలిసిన విషయం ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేంద్రమంత్రి సుజనా చౌదరితోపాటు, అక్కడున్న ఎవరూ పసిగట్టలేకపోయారని గుర్తు చేస్తున్నారు. సుజనాకు అనుకూలంగా ఉండేవారే ఢిల్లీలో కొనసాగుతున్న పరిస్థితి ఉందని, ఆయనకు నచ్చనివారు ఢిల్లీకి వెళ్లే అవకాశం లేదంటున్నారు. కీలకమైన ప్రభుత్వ అధికార ప్రతినిధి నియామకం వాయిదా వేస్తున్న తీరును బట్టి, నాయకత్వం కూడా సుజనానే ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు.
అసలు కారణం ఇదేనా?
అయితే, దీనికి నాయకత్వంలో వేరే ఆలోచనలు ఉండటమే కారణమన్న మరో వాదనా వినిపిస్తోంది. ఎన్ని పదవులిచ్చినా పదవులు తీసుకున్న నేతలు ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడం లేదని, అందుకే దానిపై బాబు అంతగా శ్రద్ధ చూపించడం లేదని పార్టీ కార్యాలయ వర్గాలు వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లలో ఎలాంటి పదవులివ్వని విషయాన్ని గుర్తు చేస్తూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని పదవులిచ్చిన ఘనత తమ పార్టీదే అయినా, పదవులు తీసుకున్న నేతలు పథకాలపై ఓనర్‌షిప్ తీసుకుని పనిచేయటం లేదన్న అసంతృప్తి నాయకత్వంలో ఉందని వివరిస్తున్నారు. చాలామందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా వారిలో పనితనం ప్రదర్శిస్తున్న వారి సంఖ్య తక్కువేనని, వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు. వీరిలో వర్ల రామయ్య ఒక్కరే గత 13 ఏళ్ల నుంచి వైఎస్, ఇప్పుడు వైసీపీపై విరుచుకుపడుతున్నారు.