రాష్ట్రీయం

సుందిళ్ల ముందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్ నిర్మాణ పనులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై రెండోవారానికి వాయిదా వేస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. గతంలో సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్ నిర్మాణ పనులను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడకు చెందిన రమాదేవితోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను ఏక సభ్య ధర్మాసనం జస్టిస్ దీపక్‌గుప్తా సోమవారం విచారించారు. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ పరాషర్ వాదనలు వినిపిస్తూ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలను కోర్టుకు వివరించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన భూమికి పరిహారం చెల్లించిన తర్వాత అభ్యంతరాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినప్పటికీ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు కొనసాగించడానికి ప్రయత్నించగా ‘పిటిషన్‌ను కొట్టివేస్తానని’ న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ ధర్మాసనంలో తాను ఒక్కడినే న్యాయమూర్తిగా ఉండటంతో పిటిషన్ కొట్టివేయడం భావ్యంకాదనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నానని అన్నారు. సుందిళ్ళ బ్యారేజీ నిర్మాణానికి 240 ఎకరాలు భూసేకరణ చట్టం 2013 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. నష్టపరిహారం చెల్లింపుపై ఫైనల్ అవార్డు పాస్ చేసి డబ్బులు కూడా డిపాజిట్ చేసింది. డబ్బులు డిపాజిట్ చేయడంతో ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్టేనని, మళ్లీ భూమి తిరిగి ఇవ్వడం సాధ్యంకాదని, ప్రాజెక్టు పనులు కొనసాగించే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నష్టపరిహారం సరిపోదనుకుంటే తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చు. అంతే తప్ప, ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోరలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూలై రెండో వారంలో పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సీనియర్ న్యాయవాదులు బి ఆదినారాయణ, రామచంద్రరావు, వెంకటరెడ్డి తదితరులు తమ వాదనలు వినిపించారు. తమ భూముల్లోకి ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రవేశించి ప్రాజెక్టు పనులు చేపటారని, పనులు వెంటనే ఆపాలని, ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న గ్రామానికి చెందిన పిటిషన్‌దారులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా గతంలోనే తోసిపుచ్చింది. పైగా నష్టపరిహారం చెల్లించిన తర్వాత భూముల స్వాధీన ప్రక్రియపై స్టే ఇవ్వలేమని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.