రాష్ట్రీయం

బిసి రిజర్వేషన్లకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: పార్లమెంటు, శాసనసభలు, తదితర చట్ట సభల్లో బిసిలకు యాభై శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సహకరించాలని జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 రాజకీయ పార్టీల నాయకులను కోరారు. కృష్ణయ్య నాయకత్వంలో బిసి సంఘం నాయకులు సోమవారం ఢిల్లీలో 18 రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్న సెలెక్ట్ కమిటీ సోమవారం పార్లమెంటు లైబ్రరీలో జరిపిన సమావేశానికి కృష్ణయ్య, బిసి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, గూడూరు వెంకటేశ్వరరావు, నీలం వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. కృష్ణయ్య సెలెక్ట్ కమిటీ సమావేశానికి వచ్చిన 18 పార్టీల నాయకులను కలిసి చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం గురించి చర్చించారు. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించటం, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించటం, విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని తొలగించటం, పంచాయితీ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34 శాతం నుండి యాభై శాతానికి పెంచి రాజ్యాంగబద్ధత కల్పించటం, బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం తదితర అంశాల గురించి ఆయన నాయకులకు వివరించారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులను కోరింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వేలలో ఉన్న 12 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, డి.ఎం.కె నాయకురాలు కనిమోళి, శరద్ యాదవ్, నవనీత కృష్ణన్, రాంగోపాల్ యాదవ్ తదితర పద్దెనిమిది మంది నాయకులను బిసి నాయకులు కలిసి తమ వాదనలు వినిపించారు.