అంతర్జాతీయం

ఖతార్‌తో తెగతెంపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 5: అరబ్ దేశాల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు అండగా నిలవడంతోపాటు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగిస్తున్న ఖతార్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోమవారం నాలుగు అరబ్ దేశాలు దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. ఖతార్ నుంచి తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రకటించాయి. వీటిలో సౌదీ అరేబియా మరో అడుగు ముందుకేసి యెమెన్‌లో కొనసాగుతున్న యుద్ధం నుంచి ఖతార్ బలగాలను ఉపసంహరిస్తామని స్పష్టం చేసింది. ఈ నాలుగు దేశాలు తమ భూభాగాలనుంచి ఖతార్ దౌత్య సిబ్బందిని వెనక్కి పంపేస్తున్నాయి. ఉగ్రవాద గ్రూపులకు నిధులను సమకూరుస్తున్నట్లు తమపై వస్తున్న ఆరోపణలను ఖతార్ ప్రభుత్వం గతంలోనే తోసిపుచ్చినప్పటికీ, నాలుగు దేశాలు దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంపై ఇప్పటివరకూ స్పందించలేదు. ఖతార్ తీరుకు నిరసనగా ఆ దేశంతో విమానయాన, సముద్ర రవాణా సంబంధాలను కూడా తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు ఈ దేశాలు స్పష్టం చేయగా, ఖతార్‌తో తమ సరిహద్దును మూసేస్తామని సౌదీ ప్రకటించింది. ఇదే గనుక జరిగితే అరేబియా ద్వీపకల్పంలోని ఇతర దేశాలతో ఖతార్‌కు సంబంధాలు తెగిపోతాయి.