అంతర్జాతీయం

ఏది మంచో అదే చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 5: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాము గట్టిగా సమర్థిస్తున్నామని, ఈ ఒప్పందం విషయంలో తాము ఏమి చేయాలో భారత్, చైనా, ఫ్రాన్స్ చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న నిక్కీ హేలీ చెప్పారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమెరికా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గత వారం ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చైనాతోపాటు భారత్ వందల కోట్ల డాలర్లు పొందుతాయని, ఆర్థికంగా అమెరికా కంటే చైనా, భారత్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొంటూ, వాతావరణ ఒప్పందంపై సంతకాలు చేయని రెండు దేశాల (సిరియా, నికరాగ్వా) సరసన అమెరికాను చేర్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు అమెరికా చేయాల్సింది ఏమిటో చెప్పాలని మిగిలిన ప్రపంచ దేశాలు భావిస్తూ ఉండవచ్చని, అయితే తమకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తామని, దీనిపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తమకు ఉందని, ఈ విషయంలో భారత్, చైనా, ఫ్రాన్స్ లాంటి ఇతర దేశాలు తమకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని నిక్కీ హేలీ స్పష్టం చేసినట్లు ‘సిబిఎస్ న్యూస్’ వార్తా సంస్థ వెల్లడించింది.