అంతర్జాతీయం

చొరబాటును సమర్థించుకున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 5: చైనా సైనికదళ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) హెలికాప్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించి ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని బారాహోటీ ప్రాంతంపై చక్కర్లు కొట్టడాన్ని ఆ దేశం సమర్ధించుకుంది. తూర్పు సరిహద్దు ప్రాంతంలో భారత్‌కు, తమకు భౌగోళిక వివాదం కొనసాగుతోందని, కనుక ఆ ప్రాంతంలో తమ సైనిక దళం తరచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేఖరులకు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పరిరక్షించేందుకు ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేస్తాయాని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. చైనా సైనిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు శనివారం చమోలీ జిల్లాపై చక్కర్లు కొట్టడంతో భారత భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేసింది. చైనా సైనిక దళం భారత గగనతలంలోకి చొరబడటం మార్చి నెల నుంచి ఇది నాలుగోసారి. చమోలీ జిల్లాపై శనివారం దాదాపు ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లిన చైనా హెలికాప్టర్లు అక్కడ గస్తీ నిర్వహించి భారత పదాతి దళాల ఫొటోలను తీసి ఉండవచ్చని న్యూఢిల్లీలో అధికార వర్గాలు తెలిపాయి. భారత గగనతలంలోకి ప్రవేశించిన చైనా హెలికాప్టర్లను జిబా సిరీస్‌కు చెందిన ఎటాక్ హెలికాప్టర్లుగా గుర్తించడం జరిగిందని, ఈ ఘటనపై భారత వైమానిక దళం దర్యాప్తు జరుపుతోందని ఆ వర్గాలు వెల్లడించాయి.